Wednesday, 23 September 2026

Tag: Education

ప్రకాశం

ఉప విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహమ్మదాపురంను కనిగిరి ఉప విద్యాశాఖ అధికారి సంజీవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడి, పాఠశాల విద్యాభివృద్ధికి చేయవలసిన కార్యక్రమాలను వివరించారు. మిషన్ మార్చ్ 2027 అమలు అయ్యే తీరును గమనించారు.అందులో భాగంగా పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి, తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్.ఎం.ఎం.ఎస్ కు సంసిద్ధమవుతున్న 8 వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులను ప్రశ్నలను అడిగి, సరైన సమాధానాలను రాబట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమును పర్యవేక్షించి, భోజనం రుచి చూశారు.అనంతరం పాఠశాల రిజిస్టర్లు తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

అనంతపురం

65 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిని మించిన గొప్ప వృత్తి మరొకటి లేదని అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ అన్నారు. ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులకు విద్యతోపాటు జీవితానికి సరైన మార్గాన్ని చూపే గురువుల సేవలు అమూల్యమని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తమ సేవలందిస్తున్న 65 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డా. పతిక రమేష్ నారాయణ, డా. పి. పద్మశ్రీ, బిసాటి భరత్, సుంకర రమేష్, డా. గీతా బాల, డా. గజ్జల లక్ష్మణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

పిఆర్టియూటీఎస్ ఉపాధ్యాయుల మహాధర్నా: హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో సిఎస్‌పి రద్దు, పిఆర్‌సి అమలు, పాత పెన్షన్‌ డిమాండ్లతో ఆందోళన

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పిఆర్‌టియూటీఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు. 33 జిల్లాల నుంచి దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయ సంఘ సభ్యులు తరలివచ్చి తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు.ప్రధాన డిమాండ్లుపిఆర్‌టియూటీఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ మూడు ప్రధాన డిమాండ్లను ముందుకెత్తారు:సిఎస్‌పి రద్దు – ఓపిఎస్ పునరుద్ధరణ: ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిఎస్‌పి)ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) పునరుద్ధరించాలి.పిఆర్‌సి తక్షణ అమలు: వేతన సవరణ సంఘం (పిఆర్‌సి)ని వెంటనే అమలు చేయాలి.2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్: 2003 డిఎస్‌సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి.రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ పేరటి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాకు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మద్దతు తెలిపి స్వయంగా పాల్గొన్నారు.మ్యానిఫెస్టో హామీలు ఎందుకు అమలు కాలేదంటే..ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ధర్నా వేదిక నుంచి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో మ్యానిఫెస్టోకు ఒక విలువ, ఒక విశ్వసనీయత ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే సిఎస్‌పి రద్దు చేస్తామని, అదేవిధంగా పిఆర్‌సి అమలు చేస్తామని, పెండింగ్ డిఎ లు, పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తామని చెప్పి మ్యానిఫెస్టో సాక్షిగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆ హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు” అని విమర్శించారు.గత ప్రభుత్వం 5 శాతం ఐఆర్ ఇచ్చి పిఆర్‌సి కమిటీ వేసిందని, ఇంకా 5 శాతం తక్కువ కొత్త పిఆర్‌సి వేస్తామని, ఆ కొత్త పిఆర్‌సి కూడా ఆరు నెలల కాలవ్యవధిలో అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన రెండు ప్రధాన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులు – నెరవేరని వాగ్దానాలుధర్నా నాయకులు వివరించిన వివరాల ప్రకారం:మే రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశమై జూన్ 2 నాటికి పిఆర్‌సి కమిషన్ నివేదిక తెప్పిస్తానని, ఆ రోజు నుంచే ఉద్యోగుల వేతన సవరణ పూర్తిస్థాయిలో అమలు చేస్తానని హామీ ఇచ్చారు.సిఎస్‌పి విధానాన్ని రద్దు చేయాలని కోరగా అధ్యయనం కోసం కమిటీ వేస్తానని చెప్పారు.2003 డిఎస్‌సి ఉపాధ్యాయుల పాత పెన్షన్ సమస్యను డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకువెళ్తానని, పరిష్కరిస్తానని తెలిపారు.పెండింగ్ బిల్లుల్లో దాదాపు రూ. 6 వేల కోట్ల చెల్లింపులు జరిగినా ఏ ఒక్క సమస్య కూడా పూర్తిస్థాయిలో క్లియర్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.”గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఇకనైనా మీరిచ్చిన హామీను నిలబెట్టుకోండి. మాట ఇచ్చారు, మాటను నిలబెట్టుకోండి” — ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డితదుపరి పోరాట కార్యాచరణపిఆర్‌టియూటీఎస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి స్పష్టం చేస్తూ, “ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని ప్రకటించారు. ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం:పిఆర్‌టియూటీఎస్ ఉద్యోగ జేఏసీలో భాగస్వామిగా ఉంది.జేఏసీ ఆధ్వర్యంలో పదో తేదీన రాష్ట్రవ్యాప్త ధర్నా జరగనుంది.ఆ ధర్నా అనంతరం జేఏసీతో సంప్రదింపులు జరిపి, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా జేఏసీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తామని తెలిపారు.ఇప్పటికైతే ఇందిరా పార్క్‌లో ధర్నా శిబిరాలు లేకుంటేనే “ఇందిరమ్మ రాజ్యానికి మంచి రోజులు వస్తాయి” అని సూటిగా హెచ్చరించారు. Uploaded Video:

ASIFABAD

బీసీ & ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్యకు సువర్ణ అవకాశం

ప్రపంచస్థాయి ఉన్నత విద్యను అభ్యసించాలనే BC, EBC విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. దరఖాస్తులు ప్రారంభం: – సెప్టెంబర్ 1, 2026 దరఖాస్తులకు చివరి తేదీ: – సెప్టెంబర్ 30, 2026 మొత్తం 350 మంది విద్యార్థుల ఎంపిక: • 250 మంది BC విద్యార్థులు • 100 మంది EBC విద్యార్థులు అర్హతలు: ✅ కుటుంబ వార్షిక ఆదాయం ₹5 లక్షలలోపు ఉండాలి ✅ వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు ✅ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు ఉండాలి ✅ GRE – 260 / GMAT – 500 ✅ TOEFL – 60 / IELTS – 6.0 / PTE – 50 ఈ పథకం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులు విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, PhD మరియు ఇతర ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు ఆర్థిక సహాయం పొందవచ్చు. అర్హత కలిగిన BC & EBC విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, గడువులోగా దరఖాస్తు చేసుకోండి. 👉 దరఖాస్తులు & పూర్తి వివరాల కోసం – Telangana ePASS Portal: telanganaepass.cgg.gov.in

ASIFABAD

MBBS , BDS కౌన్సిలింగ్ ఖరారు

సెప్టెంబర్‌ 3 నుంచి రిజిస్ట్రేషన్‌.. 9న సీట్ల కేటాయింపు ఫలితాలు 12 నుంచి 18 వరకు కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఏఐక్యూ, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల సీట్లకు ఎంసీసీ షెడ్యూల్‌ నీట్‌–యూజీ 2026లో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల రెండో విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ), 100 శాతం డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఏఎఫ్‌ఎంసీ, ఎయిమ్స్, జిప్‌మర్‌ సంస్థల్లోని సీట్లకు ఈ కౌన్సెలింగ్‌ వర్తిస్తుంది. సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో పాల్గొనే కళాశాలలు తాత్కాలిక సీట్ల వివరాలను పరిశీలించనున్నాయి. సెప్టెంబర్‌ 3 నుంచి 8 వరకు అభ్యర్థుల రిజి్రస్టేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.* సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉండగా.. ఫీజు చెల్లింపునకు సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంటుంది. అదే సమయంలో సెప్టెంబర్‌ 3 నుంచి 9 వరకు చాయిస్‌ ఫిల్లింగ్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 9 ఉదయం 10 గంటల వరకు ఛాయిస్‌ ఫిల్లింగ్‌ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్‌ 8 సాయంత్రం 4 గంటల నుంచి సెప్టెంబర్‌ 9 ఉదయం 10 గంటల వరకు చాయిస్‌ లాకింగ్‌ చేసుకోవాలి. సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో ఎంసీసీ సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనుంది.* సెప్టెంబర్‌ 11న రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 12 నుంచి 18 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్‌ చేసి చేరాల్సి ఉంటుంది. చేరిన అభ్యర్థుల వివరాలను ఆయా కళాశాలలు సెప్టెంబర్‌ 19న ఎంసీసీకి ధ్రువీకరించాల్సి ఉంటుంది. రెండో విడతలో సీటు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు గడువులను తప్పకుండా పాటించాలని ఎంసీసీ సూచించింది. ముఖ్యంగా చాయిస్‌ ఫిల్లింగ్, లాకింగ్‌ గడువు దాటిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌లో రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను సెప్టెంబర్‌ 7 నుంచి 11 వరకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర కౌన్సెలింగ్‌ సంస్థలు పరిశీలించనున్నాయి. ఏఐక్యూ, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల పరిధిలో చేరిన అభ్యర్థుల వివరాలను ఎంసీసీ సెప్టెంబర్‌ 19న ధ్రువీకరించనుంది. రాష్ట్ర కోటాలో చేరిన వారి వివరాలను కూడా సెప్టెంబర్‌ 19న ధ్రువీకరించనున్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉన్నందున శని, ఆదివారాలు, గెజిటెడ్‌ సెలవు రోజులను కూడా పనిచేసే రోజులుగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలలు, సంస్థలకు ఎంసీసీ సూచించింది. రెండో విడతలో సీటు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులో చేరకపోతే సీటుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అభ్యర్థులు షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

నంద్యాల

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్‌గా దండే వెంకట్ నరేష్

నంద్యాల : నంద్యాల జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా కరుణామయ విద్యాసంస్థల కరస్పాండెంట్ దండే వెంకట్ నరేష్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.బాలల హక్కుల పరిరక్షణ, అనాథలు, వీధిబాలలు, ఆపదలో ఉన్న చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని వెంకట్ నరేష్ తెలిపారు. ఆయన నియామకంపై మంత్రి ఫరూక్ అభినందనలు తెలిపారు.

విద్య విజ్ఞానం

యూత్ ఫర్ వికసిత్ భారత్ @2047 జాతీయ యువజనోత్సవం తుది ఫలితాలు విడుదల

22 రాష్ట్రాల నుంచి 5,590 మంది విద్యార్థుల భాగస్వామ్యం.. వివిధ విభాగాల్లో విజేతల ప్రకటన “యూత్ ఫర్ వికసిత్ భారత్ @2047 – అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత దృష్టికోణం” జాతీయ యువజనోత్సవం తుది ఫలితాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (AISU) ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యూత్ అసోసియేషన్ (FIYA), AISU ఆధ్వర్యంలో ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (AITAM), లీగల్‌స్కూల్.ఇన్, ఈజస్టిస్‌ఇండియా.కామ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ జాతీయ యువజనోత్సవం ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి, సమగ్ర, ప్రగతిశీల భారతదేశ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ నిర్మాణం, ఆవిష్కరణలు, విద్య, సాంకేతికత, వ్యాపారవేత్తల ఆలోచనలు, సామాజిక బాధ్యత, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులు తమ ఆలోచనలు, ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన 2,349 పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి 5,590 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంబంధిత న్యాయనిర్ణేతలు, మూల్యాంకన కమిటీల నివేదికల ఆధారంగా తుది ఫలితాలను ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి స్థాయి విజేతలు ఆన్‌లైన్ క్విజ్ ఆన్‌లైన్ క్విజ్‌లో ప్రథమ విజేతగా ఎ. సాయి శ్రీ జ్యోతిక (ఏపీ మోడల్ స్కూల్, వావిలపల్లిపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్) నిలిచారు. ద్వితీయ విజేతగా యచ్చిన రుత్విక్ సాయి (ప్రియాంకాస్ విద్యోదయ హైస్కూల్, విశాఖపట్నం) నిలవగా, రన్నర్‌గా అనౌషా అనీస్ కేటీ (జీజీహెచ్‌ఎస్‌ఎస్, మലപ്പురం, కేరళ) ఎంపికయ్యారు. వ్యాసం / కథనం రచన వ్యాసం, కథనం రచన విభాగంలో ప్రథమ విజేతగా ఇవాని వెంకట శంకర నాగ సాయి ఆరాధ్య (రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్, ఆంధ్రప్రదేశ్) నిలిచారు. ద్వితీయ విజేతగా కండి ఆర్యన్ (నారాయణ జూనియర్ కళాశాల, శ్రీకాకుళం) ఎంపికయ్యారు. సోనం (కిసాన్ విద్యా మందిర్ ఇంటర్ కాలేజ్, ఉత్తరప్రదేశ్), యచ్చిన రుత్విక్ సాయి (విశాఖపట్నం) రన్నర్లుగా నిలిచారు. రెండో స్థాయి విజేతలు గ్రూప్ క్విజ్ గ్రూప్ క్విజ్‌లో ప్రథమ విజేతగా జీక్యూ-14 బృందం – ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, టెక్కలి, ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ బృందంలో కొలుసు సాయి వెంకట సన్నిహిత్, చల్లా సాయి స్వరూప్, చిలక ప్రవల్లిక, మొగిలి వినయ్, గార దిలీప్ ఉన్నారు. ద్వితీయ స్థానంలో జీక్యూ-03 బృందం – సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ నిలిచింది. ఈ బృందంలో శ్రీహరి ఈ.వి., దినేష్ పటేల్, వైష్ణవ్ పి.వి., క్రిష్టప్ప గారి మనోగ్న, నందన ఎం. ఉన్నారు. మూడో స్థానంలో జీక్యూ-16 బృందం – ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, టెక్కలి నిలిచింది. ఈ బృందంలో సిమ్మ ధిల్లేశ్వరి, జనపన తరుణ్, జి. రితీష, ఈడి పవన్, పాతపట్నం సమీర ఉన్నారు. లఘు వీడియో పోటీ లఘు వీడియో పోటీలో ప్రథమ విజేతగా ఎస్‌వీ-02 బృందం – డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ కళాశాల విశ్వవిద్యాలయం, ఢిల్లీ నిలిచింది. బృంద సభ్యులుగా రుద్రాంశ్ ధింగ్రా, దక్ష్ సేథ్, సౌరవ్ టోప్పో, ఆయుష్ కుక్రేజా ఉన్నారు. వ్యాసం / కథనం రచన ఈ విభాగంలో ప్రథమ విజేతగా రోషన్ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రభుత్వ కళాశాల, సిమ్లా), ద్వితీయ విజేతగా యచికా రాజు మార్ఘడే (జి.ఎస్. కాలేజ్ ఆఫ్ కామర్స్, వార్ధా) నిలిచారు. రిధి కక్కర్ (ద్రోణాచార్య గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, నోయిడా) రన్నర్‌గా ఎంపికయ్యారు. విజన్ స్టేట్‌మెంట్ పోటీ విజన్ స్టేట్‌మెంట్ పోటీలో ప్రథమ విజేతగా రుద్రాంశ్ ధింగ్రా (డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ కళాశాల విశ్వవిద్యాలయం, ఢిల్లీ), ద్వితీయ విజేతగా దర్శిక్ జైన్ (ఎస్.డి. కాలేజ్, ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్) నిలిచారు. కొంచాడ వినయ్ (ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, టెక్కలి) రన్నర్‌గా ఎంపికయ్యారు. పోస్టర్ రూపకల్పన పోస్టర్ రూపకల్పనలో ప్రథమ విజేతగా కాజల్ (ప్రభుత్వ మహిళా పారిశ్రామిక శిక్షణ సంస్థ, మీరట్), ద్వితీయ విజేతగా జషన్‌ప్రీత్ కౌర్ (ఖాల్సా కాలేజ్ ఫర్ ఉమెన్, లూధియానా) నిలిచారు. లక్ష్మి (ప్రభుత్వ రాజీంద్ర కళాశాల, భటిండా) రన్నర్‌గా ఎంపికయ్యారు. ఆన్‌లైన్ క్విజ్ రెండో స్థాయి ఆన్‌లైన్ క్విజ్‌లో ప్రథమ విజేతగా అంకిత్ సింగ్ (బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి), ద్వితీయ విజేతగా పైడిశెట్టి జ్యోత్స్న శ్రీ (ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, టెక్కలి) నిలిచారు. డాక్టర్ అనుభవ్ సింగ్ (ఐసీఏఆర్-ఐవీఆర్‌ఐ, ఉత్తరప్రదేశ్) రన్నర్‌గా నిలిచారు. పోస్టర్ సిరీస్ – క్యాప్షన్ల పోటీ ఈ విభాగంలో ప్రథమ విజేతగా కె.ఎం. అర్ఫా (చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ, మీరట్), ద్వితీయ విజేతగా రుద్రాంశ్ ధింగ్రా (డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ కళాశాల విశ్వవిద్యాలయం, ఢిల్లీ) నిలిచారు. నినాద రచన / వన్‌లైనర్ ప్రచారం నినాద రచన విభాగంలో ప్రథమ విజేతగా కె. హయా (సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ) నిలిచారు. ద్వితీయ విజేతగా రోహన్ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రభుత్వ కళాశాల, సంజౌలి, సిమ్లా), రన్నర్‌గా జషన్‌ప్రీత్ కౌర్ (ఖాల్సా కాలేజ్ ఫర్ ఉమెన్, లూధియానా) ఎంపికయ్యారు. విజేతలకు అభినందనలు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు. దేశ నిర్మాణం, విద్య, సామాజిక సమానత్వం, డిజిటల్ సాధికారత, ఆవిష్కరణలు, స్వాతంత్ర్యం, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులు చూపిన ప్రతిభ, ఆసక్తి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు, యూత్ ఫర్ వికసిత్ భారత్ @2047 కార్యక్రమం పరిరక్షకుడు శ్రీ ఎం. సాయి కృష్ణ కార్యక్రమ విజయానికి సహకరించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యూత్ అసోసియేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, టెక్కలి, లీగల్‌స్కూల్.ఇన్, ఈజస్టిస్‌ఇండియా.కామ్, నిర్వాహక కమిటీలు, న్యాయనిర్ణేతలు, మూల్యాంకన కమిటీలు, విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతలో సృజనాత్మకత, ఆవిష్కరణలు, నాయకత్వం, దేశభక్తి, బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందించేలా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.