Wednesday, 30 September 2026

Tag: Doctor

నంద్యాల

నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్థీషియా సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

​వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 24, 25, 26 తేదీల్లో నంద్యాల శాంతిరాం వైద్య కళాశాలలో 36వ రాష్ట్రస్థాయి అనస్థీషియా వైద్యుల సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఈ సదస్సు ప్రథమ సమాచార బ్రోచర్‌ను శాంతిరాం విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ మిద్దె శాంతిరాముడు ఆవిష్కరించారు. ​ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అనస్థీషియాలాజిస్ట్స్‌ AP శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి సుమారు 700 మంది వైద్య నిపుణులు హాజరవుతారని, అనస్థీషియా రంగంలోని ఆధునిక విధానాలపై అవగాహన కల్పిస్తారని నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వసంత చౌహాన్‌, వైద్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.