సీఎస్ డెవలపర్స్‌లో క్రాస్ సెల్లింగ్‌పై గ్రూప్ డిస్కషన్
సీఎస్ డెవలపర్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అదనపు ఆదాయ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో క్రాస్ సెల్లింగ్‌పై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. సమావేశంలో POSP మోడల్, వాహన బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, వాటి ద్వారా టీమ్ సభ్యులకు లభించే వ్యాపార అవకాశాలపై చర్చించారు. బ్రాంచ్ మేనేజర్ గంపాల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొద్దు మహేష్, ఎంట్రపాటి వెంకయ్య, వినలరావు రామమోహన్‌రావు, కామటం జోజి, అరవ రవికిరణ్, వాసవి, జాహ్నవి, కాకుమాని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్, క్రాస్ సెల్లింగ్ టీమ్ లీడర్లతో వ్యాపార విస్తరణ, కస్టమర్లకు సమగ్ర సేవలందించే విధానంపై చర్చించారు. కార్యక్రమానికి సహకరించిన సీఎస్ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బండ్ల చంద్రశేఖర్‌కు పున్నమి తరఫున ధన్యవాదాలు తెలిపారు.


