బ్రెస్ట్ చికిత్సలో మైలురాయి
నెల్లూరు మెడికవర్ హాస్పిటల్‌లో ఆధునిక ఇమేజ్-గైడెడ్ బ్రెస్ట్ ట్యూమర్ మార్కర్ క్లిప్ ప్లేస్‌మెంట్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. నెరెల్ల కృష్ణతేజ ఈ ప్రక్రియ చేపట్టారు. కీమోథెరపీ అనంతరం ట్యూమర్ తగ్గినా, కనిపించకుండా పోయినా అసలు స్థానాన్ని క్లిప్ ద్వారా గుర్తించవచ్చన్నారు. శస్త్రచికిత్స ప్రణాళిక, ట్యూమర్ బెడ్ గుర్తింపు, బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీతోపాటు వైద్య విభాగాల సమన్వయానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.


