44 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ పురుషుల మారథాన్‌లో చారిత్రాత్మక రజత పతకం సాధించాడు. 2 గంటలు 11 నిమిషాలు 37 సెకన్లలో రేసును పూర్తి చేసిన బర్వాల్, 44 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం అందించాడు. జపాన్‌కు చెందిన ఇచిటాకా యమషితా స్వర్ణం గెలుచుకోగా, చైనాకు చెందిన ఫెంగ్ పేయౌ కాంస్యం సాధించాడు. బర్వాల్ ప్రదర్శన భారత అథ్లెటిక్స్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. విదేశీ గడ్డపై ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


