పామూరు,నవంబర్ 30@4:51am సోమవారం (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో 6 వ వార్డు మెంబర్ గా పోటీచేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన షేక్. గయాజ్ కు 6 వార్డు ఓటరు మహాసేయులు, తమ ఆదరాభిమానాలు తెలుపుతూ ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్బంగా 6 వార్డు విజేత గయాజ్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ, నాపై నమ్మకం వుంచి నన్ను గెలిపించిన నా వార్డు ప్రజలకు ఎంతో రుణపడిఉన్నానని, 6 వార్డు కోసం కావలసిన మౌలిక వసతుల ఏర్పాటులో నా వంతు ఉడుతాభక్తితో కృషి చేస్తానని అన్నారు..








