పామూరు, నవంబర్ 30@3:10am సోమవారం (పున్నమి తెలుగు దినపత్రిక ) ఈ నెల 26 వతేది జరిగిన పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైయస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, జాననాయకుడు, పేదలపెన్నిధిగా పిలువబడే బుజ్జి భాయ్ (షేక్. చాంద్ బాషా ) 1139 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం మండల స్థాయిలోని ప్రజలందరికి తెలిసిన విషయం.. ఈ విజయోత్చవ ఆనందంలో భాగంగా పామూరు నూతన సర్పంచ్ గా ఎన్నికయిన షేక్. చాంద్ బాషా (బుజ్జి భాయ్ ),పామూరులోని ప్రతి వీధిలో తిరుగుతూ, తనను ఓటు వేసి గెలిపించిన, ఓటరు దేవుళ్లను కలుసుకుని, ధన్యవాదములు తెలిపారు.. ఈ ధన్యవాదముల కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలసుబ్బయ్య నగర్ లోని వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు శీలం బాల గురవయ్య మరియు వారి అల్లుడు నల్లబోతుల చందు (సచివాలయ ప్రభుత్వ ఉద్యోగి )గార్ల ఇంటిదగ్గర సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు శీలం బాల గురవయ్య పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ, బుజ్జి భాయ్ పేదల పక్షపాతి అని, ఎప్పుడు పిలిచినా, నేను వున్నాను==నేను విన్నాను అని,దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నినాదంతో ముందుకు నడిచి పేదలను గౌరవించే వ్యక్తి అని కొనియాడారు.. ఈ మహత్తర విజయోత్చావ ఆత్మీయ కలయిక ర్యాలీలో, మండలాధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి, 6 వ వార్డు ప్రజాబంధు గయాజ్ షేక్,ముస్లిం వైసీపీ పార్టీ నాయకులు లుక్ టైలర్, మరియు వైసీపీ పార్టీ అభిమానులే కాక 2వ వార్డు మెంబర్ మానం ప్రసాద్,యాటా రాఘవేంద్ర స్వామి,, 4 వ వార్డు మెంబర్ వజ్రాల సుబ్బారావు,,పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.




