Sunday, 13 September 2026

Tag: Andhrapradesh

అమరావతి

ఏపీలో 3,736 మద్యం షాపుల కొనసాగింపు

ఏపీలో 2026-27కు 3,736 మద్యం దుకాణాలను కొనసాగిస్తూ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి 2027 సెప్టెంబర్‌ 30 వరకు ఇది అమల్లో ఉంటుంది. వీటిలో 3,396 ఓపెన్‌ కేటగిరీ, 340 గీత కులాలకు కేటాయించిన షాపులు. ప్రస్తుత లైసెన్సుదారులు 38% రెన్యువల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నుతో మరో ఏడాది కొనసాగవచ్చు. రూ.35 వేల ప్రాసెసింగ్‌ ఫీజు ఉంటుంది. రెన్యువల్‌ కాని షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తారు. ప్రతి షాపులో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించనున్నారు. ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌, ఈ-ఇన్వెంటరీతో స్టాక్‌, విక్రయాలపై డిజిటల్‌ నిఘా ఉంటుంది. ఎంఆర్‌పీ ఉల్లంఘనలు, నకిలీ లేదా అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారు. అనధికార విక్రయానికి తొలి నేరంపైనే రూ.25 లక్షల జరిమానా విధించనున్నారు. వినియోగదారులు 14405, ఎక్సైజ్‌ సురక్ష యాప్‌, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. తిరుపతిలో నిర్దిష్ట ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుపై ఆంక్షలు కొనసాగుతాయి.

ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలు తేలిగ్గా వద్దు:సీఎం చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో సమర్థులైన మహిళా నేతలను గుర్తించాలని చెప్పారు. చిన్న సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులపై అనవసర వివాదాలు కూటమికి నష్టం చేస్తాయని హెచ్చరించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జెన్‌జీతో కోటంరెడ్డి ముఖాముఖి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని జెన్‌జీ యువతతో నేరుగా మమేకమయ్యేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 51 ఆత్మీయ భేటీలు నిర్వహించనున్నారు. సుమారు 20 వేల మంది విద్యార్థులతో జరిగే ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు పార్ధసారధి నగర్‌లోని జెనెక్స్ కళాశాలలో ప్రారంభమవుతుంది. యువత ఆలోచనలు, ఆకాంక్షలు, సూచనలు, సద్విమర్శలను స్వీకరిస్తూ కుటుంబ సభ్యుడిలా వారితో మమేకమవుతానని ఎమ్మెల్యే తెలిపారు.

విశాఖపట్నం

విశాఖలో అంతర్జాతీయ గురుకులం

విశాఖపట్నంలో అత్యాధునిక గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ స్వామినారాయణ గురుకుల ట్రస్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆగస్టు 22న విశాఖ నోవోటెల్‌లో జరిగిన బ్రిక్స్ మంత్రుల సమావేశంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక జ్ఞానంతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు మెగా విజన్

మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కీలక ప్రతిపాదనలు చేశారు. అమరావతి–బెంగళూరు–చెన్నై బుల్లెట్ ట్రైన్, ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, విద్యుత్ గ్రిడ్, స్కిల్లింగ్ కన్సార్టియం ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం, విశాఖ–విజయవాడ మెట్రోలకు అనుమతులు, విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరగలదన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.