వార్త ముఖ్యాంశాలు
- "ఈ ప్రపంచం "నిన్ను ఏడిపిస్తుంది,ఎదురొడ్డి నిలబడగలవా..?
- " ఈ ప్రపంచం "నిన్ను ద్వేషిస్తుంది,ధైర్యంతో దాటగలవా..?
- "ఈ ప్రపంచం "నిన్ను తరుముతుంది, తరతరాలు గుర్తుండేలా తెగించగలవా..?
“ఈ ప్రపంచం “నిన్ను ఏడిపిస్తుంది,ఎదురొడ్డి నిలబడగలవా..?
” ఈ ప్రపంచం “నిన్ను ద్వేషిస్తుంది,ధైర్యంతో దాటగలవా..?
“ఈ ప్రపంచం “నిన్ను తరుముతుంది, తరతరాలు గుర్తుండేలా తెగించగలవా..?
“ఈ ప్రపంచం “నిన్ను ఒంటరిని చేస్తుంది,ఒంటి చేత్తో ఓటమిని ఓడించగలవా..?
“ఈ ప్రపంచం” నీకు అవమానమసిని పూస్తుంది,ఆత్మస్థైర్యంతో అంతులేని కసిని గుండెలో నిలుపగలవా..?
“ఈ ప్రపంచం ” నీ ఆలోచనలను ఆదిలోనే తృంచుతుంది,
ఆ ఆకాశవీధిలో నీ ఆలోచనలను పునర్నిర్మించగలవా..?
ఏదో ఒక రోజు ఏ.దో.ఒ.క.రో.జు..
“ఈ ప్రపంచం “నీ చావును కోరుకుంటుంది,కాలే నీ కట్టె పదిమందికి వెలుగవ్వాలని కోరుకోగలవా..?
అయితే పరిగెత్తు ఈ ప్రపంచాన్ని జయించడానికి
ఈ ప్రపంచం నిన్ను చిన్నచూపు చూస్తుంది ప్రతిచూపుకి చిరుత పులి అవ్వగలవా ఈ ప్రపంచం నీ ఆలోచనలకు
–కవి, రచయిత –కె. రెడ్డప్ప (భౌతికశాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )