వార్త ముఖ్యాంశాలు
- శివుడి జటాజూటంలో గంగ ఇంకిపోని..!
- ఆ బ్రహ్మ రాసిన రాతలు,తల రాతలు మారిపోని..!
- "నిజం "ఆ అగ్నిగర్భంలో దాగిపోని, న్యాయం నశించని,అన్యాయం ప్రతి సిగకు అలంకార భూషణం అవ్వని కాలకూట విషం ఆ శివుడి కంఠం నుండి బయల్పడని..!
శివుడి జటాజూటంలో గంగ ఇంకిపోని..!
ఆ బ్రహ్మ రాసిన రాతలు,తల రాతలు మారిపోని..!
“నిజం “ఆ అగ్నిగర్భంలో దాగిపోని,
న్యాయం నశించని,అన్యాయం ప్రతి సిగకు అలంకార భూషణం అవ్వని
కాలకూట విషం ఆ శివుడి కంఠం నుండి బయల్పడని..!
ఆ విష ప్రవాహ జడిలో నరులందరూ తడిసి ముద్దవని
మనిషిలో నిలువెత్తు స్వార్థం రగిలిపోని..!
యమపురి భూలోకానికి తిరిగి రానీ..!
ప్రతి గడప ఎరుపేక్కనీ..!
ప్రతి నడక అన్యాయానికి పడకవ్వని..!
ప్రతి పలుకు స్వార్థానికి వెలుగవని
మానవత్వం శృతి తప్పి,మతి తప్పి, గతి తప్పి, పయనించని నరుడు “నా”అన్న స్వార్టంతో నిలువునా దహించి పోనీ
ఇదే కదా ఇదే కదా లోకం తీరు,
అదే కదా అదే కదా ప్రతి నరుడి జోరు ———-కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, DSR హై స్కూల్, అల్లూరు )