Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Sahithi

సాహితీ

ఈ ప్రపంచం

“ఈ ప్రపంచం “నిన్ను ఏడిపిస్తుంది,ఎదురొడ్డి నిలబడగలవా..? ” ఈ ప్రపంచం “నిన్ను ద్వేషిస్తుంది,ధైర్యంతో దాటగలవా..? “ఈ ప్రపంచం “నిన్ను తరుముతుంది, తరతరాలు గుర్తుండేలా తెగించగలవా..? “ఈ ప్రపంచం “నిన్ను ఒంటరిని చేస్తుంది,ఒంటి చేత్తో ఓటమిని ఓడించగలవా..? “ఈ ప్రపంచం” నీకు అవమానమసిని పూస్తుంది,ఆత్మస్థైర్యంతో అంతులేని కసిని గుండెలో నిలుపగలవా..? “ఈ ప్రపంచం ” నీ ఆలోచనలను ఆదిలోనే తృంచుతుంది, ఆ ఆకాశవీధిలో నీ ఆలోచనలను పునర్నిర్మించగలవా..? ఏదో ఒక రోజు ఏ.దో.ఒ.క.రో.జు.. “ఈ ప్రపంచం “నీ చావును కోరుకుంటుంది,కాలే నీ కట్టె పదిమందికి వెలుగవ్వాలని కోరుకోగలవా..? అయితే పరిగెత్తు ఈ ప్రపంచాన్ని జయించడానికి ఈ ప్రపంచం నిన్ను చిన్నచూపు చూస్తుంది ప్రతిచూపుకి చిరుత పులి అవ్వగలవా ఈ ప్రపంచం నీ ఆలోచనలకు –కవి, రచయిత –కె. రెడ్డప్ప (భౌతికశాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )