గవర్నర్ కోటాలో MLCలుగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, రమాదేవి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, రమాదేవికి అవకాశం లభించింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన వర్ల రామయ్యకు ఎస్సీ కోటాలో శాసనమండలి ప్రాతినిధ్యం కల్పించారు. అనంతపురంలో డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా, టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న రమాదేవికి బీసీ కోటాలో అవకాశం దక్కింది. పార్టీకి అందించిన సేవలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


