Thursday, 10 September 2026

Tag: #నెల్లూరు #ప్రభుత్వపాఠశాలలు #పొంగూరునారాయణ #నారాలోకేశ్ #CSRFunds #ModelSchools #విద్యాభివృద్ధి #పున్నమిన్యూస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు:మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్, డీఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం పరిశీలించారు. దాతలు, సీఎస్‌ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న పనులను సెప్టెంబర్ 15లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 16న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వీటిని ప్రారంభిస్తారని తెలిపారు. నగరంలోని 15 ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయడంతోపాటు, రూ.20 కోట్లతో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని వెల్లడించారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. విద్యార్థులతో కలిసి బాస్కెట్‌బాల్ ఆడి మంత్రి నారాయణ సందడి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.