హైదరాబాద్
దాండియా వేడుకల్లో లైటింగ్ కూలి విద్యార్థిని మృతి
: నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి దాండియా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. లైట్లు అమర్చిన భారీ ఇనుప నిర్మాణం విద్యార్థులపై కూలడంతో ఓ విద్యార్థిని మృతిచెందింది. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
