Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: తెలంగాణ జనగామ వరంగల్

జనగాం

బీఎస్పీ వరంగల్ పార్లమెంట్ ఇంచార్జిగా జలగం ప్రవీణ్ నియామకం: పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని వెల్లడి

​జనగామ జిల్లా,: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వరంగల్ పార్లమెంట్ ఇంచార్జిగా జలగం ప్రవీణ్ నియమితులయ్యారు. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్, చీఫ్ జోన్‌–2 కోఆర్డినేటర్ దాగిళ్ల దయానందరావు ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి జలగం ప్రవీణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజన సమాజ అభ్యున్నతి, పార్టీ సిద్ధాంతాల సాధనకు నిరంతరం కృషి చేస్తానన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతానని, తన నూతన ప్రయాణంలో పార్టీ శ్రేణులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.