జనగాం
సముద్రాల పాఠశాలలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల ఎంపీపీఎస్ పాఠశాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్థులకు ప్రజాపాలన ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


