పేదలకు రేషన్ కార్డుల పంపిణీ బండ లింగంపల్లి
పున్నమి ప్రతినిధి ఆగస్టు 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ ఆవరణలో గౌరవ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు వార్డు సభ్యులు గ్రామస్థాయి అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రేషన్ కార్డులు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రయోజనాలు పొందేందుకు దోహదపడతాయని కాంగ్రెస్ నాయకులకు తెలిపారు











