విశాఖ జిల్లా లో కుటుంబం బలాన్మరణం
విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం లో శుక్రవారం రాత్రి ఓ కుటుంబం బాలాన్మరణానికి పాల్పడింది.స్థానికుల సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల సమయం వరకు ఇద్దరు భార్య భర్తలు కలిసి సరదాగా కనిపించారని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముందుగా ఇద్దరు చిన్నారులకు ఇచ్చి తల్లి పురుగుల మందు తాగి మృతి చెందగా అక్కడికి గంట వ్యవధిలో భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఉదయం నుంచి అందరికి రాఖీ లు కట్టి సరదాగా గడిపారు అని స్థానికులు చెబుతున్నారు.ముందుగా భార్య భర్త లు ఇద్దరు వారి వారి బంధువులకు,కుటుంబ సభ్యులకు watsup ద్వారా “పిల్లలు చనిపోయారు.మేము చనిపోతున్నాం.ఎవ్వరూ మాకోసం బాధ పడకండి “అని సందేశం పంపారు.ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మృతులు మల్లా ప్రవీణ్ కుమార్,అలహ్య ఇద్దరు చిన్నారులు ఉన్నారు.చిన్నారుల వయసు సుమారు మూడు ,చిన్న పాపకి 1 సంవత్సరం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం KGH కి తరలించారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


