Friday, 2 October 2026

Tag: ఎల్బీనగర్

రంగారెడ్డి

రాక్ టౌన్ కాలనీలో శ్రీ లక్ష్మి టీవీఎస్ షోరూమ్ ఘన ప్రారంభం

ఎల్బీనగర్: ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి టీవీఎస్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. టీవీఎస్ మోటార్ కంపెనీ సౌత్ జోనల్ మేనేజర్ (సేల్స్) కేంద్రజ్ జోషి, రీజినల్ మేనేజర్ (సేల్స్) సుప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి వంగా, కుటుంబ సభ్యులతో కలిసి దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టీవీఎస్ మోటార్ కంపెనీ రీజినల్ మేనేజర్ (సర్వీస్) బినోయ్ కుమార్ ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. అలాగే టీవీఎస్ ఏరియా మేనేజర్ (సేల్స్) గౌరవ్ మాలిక్ ఆధ్వర్యంలో స్పేర్ పార్ట్స్ కౌంటర్‌ను ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన వాహనాలు, మెరుగైన సర్వీస్, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అందించడమే లక్ష్యంగా శ్రీ లక్ష్మి టీవీఎస్ షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రతినిధులు, షోరూమ్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, వినియోగదారులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నూతన షోరూమ్ నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు… సిరి మహాలక్ష్మి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

పున్నమి: సెప్టెంబర్ 14, రంగారెడ్డి జిల్లా: ఎల్బీనగర్, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరి మహాలక్ష్మి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో సోమవారం సంస్థ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ కళ్లెం వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్వరి దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. వినాయకుని ఆశీస్సులతో సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హనీమీ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. వినాయక నామస్మరణతో సంస్థ కార్యాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

రంగారెడ్డి

ఎల్బీనగర్‌లో ఘనంగా ‘డల్లాస్‌పురం’ తెలుగు కిచెన్ & బార్ గ్రాండ్ ఓపెనింగ్

రంగారెడ్డి జిల్లా: ఎల్బీనగర్‌లో తెలుగు సంప్రదాయ రుచులకు ఆధునిక హంగులను జోడిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ‘డల్లాస్‌పురం – తెలుగు కిచెన్ & బార్’ గ్రాండ్ ఓపెనింగ్ ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్వానితులు, నిర్వాహకులు, శ్రేయోభిలాషుల సందడితో ఉత్సాహభరితంగా సాగింది. తెలుగు వంటకాల ప్రత్యేకతను, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా డల్లాస్‌పురంను తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ తెలుగు వాతావరణాన్ని గుర్తుచేసేలా రెస్టారెంట్ రూపకల్పన చేయడంతో పాటు, సంప్రదాయ రుచులను ఆధునిక వాతావరణంలో అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా తెలుగు వంటకాలపై ఆసక్తి ఉన్నవారికి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన సమయం గడపాలనుకునే వారికి డల్లాస్‌పురం మంచి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహారం నాణ్యత, రుచి, అతిథులకు అందించే సేవలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కల్లెం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తెలుగు వంటకాల ప్రత్యేకతను మరింతగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో డల్లాస్‌పురంను ప్రారంభించినట్లు తెలిపారు. నగర జీవనశైలికి అనుగుణంగా సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు, తెలుగు సంప్రదాయ ఆహార రుచులను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా రెస్టారెంట్‌ను సందర్శించిన అతిథులు అక్కడి వాతావరణం, అలంకరణ, తెలుగు సంస్కృతి ప్రతిబింబించే ఏర్పాట్లను ప్రశంసించారు. నూతనంగా ప్రారంభమైన డల్లాస్‌పురం తెలుగు కిచెన్, బార్ విజయవంతంగా కొనసాగాలని, ఎల్బీనగర్‌లో ప్రత్యేక గుర్తింపు పొందాలని పలువురు ఆకాంక్షించారు.

రంగారెడ్డి

బైరామల్‌గూడలో ఘనంగా “టోటల్ ఎనర్జీస్ ఆటో LPG – శ్రీపాద ఫ్యూయల్స్” ప్రారంభం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: కర్మన్ ఘట్, బైరామల్‌గూడలో వాహనదారులకు మరింత మెరుగైన ఇంధన సేవలు అందించే లక్ష్యంతో “టోటల్ ఎనర్జీస్ ఆటో LPG – శ్రీపాద ఫ్యూయల్స్” నూతనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆటో రిక్షా డ్రైవర్లు, ఇతర LPG వాహనదారులకు నాణ్యమైన ఇంధనాన్ని, సరైన పరిమాణంలో అందించడంతో పాటు మెరుగైన మైలేజీ పొందేలా సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. “పక్కా క్వాలిటీ – పక్కా క్వాంటిటీ – పక్కా మైలేజ్” అనే నినాదంతో శ్రీపాద ఫ్యూయల్స్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో వాహనదారులను ఆకట్టుకునేలా గ్యాస్ నింపించుకునే వినియోగదారులకు ఉచిత టీ అందించే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆటో LPG వినియోగం ద్వారా వాహనదారులకు ఇంధన ఖర్చులను ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని, నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. బైరామల్‌గూడ పరిసర ప్రాంతాల ఆటో డ్రైవర్లు, వాహనదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. బైరామల్‌గూడలో ప్రారంభమైన శ్రీపాద ఫ్యూయల్స్ ఆటో LPG కేంద్రం వాహనదారులకు అందుబాటులోకి రావడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

రంగారెడ్డి

వేదాంతు లెర్నింగ్ సెంటర్ కొత్తపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎం.ఈ. రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో సోమవారం వేదాంతు లెర్నింగ్ సెంటర్ కొత్తపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులను ఈ వేదికగా సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేదాంతు తెలంగాణ స్టేట్ హెడ్ రవి కిరణ్, అకాడమిక్ హెడ్ భాను ప్రతాప్, బిజినెస్ హెడ్ విజయ్ సాగర్, మరియు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకల గురుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాలలో దిల్.సుఖ్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని నిర్వాహకులు తెలిపారు. కేవలం ఒకే ఒక బ్యాచ్ నుంచి 40 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 15 మందికి ఐఐటీ సీట్లు సాధించి అఖిల భారత స్థాయిలో బ్రాంచ్ కీర్తిని ఇనుమడింపజేశారని వెల్లడించారు. విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్లో అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల చేత బోధన అందిస్తున్నామని, ఇక్కడ క్లాసులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు కెమెరాల అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక కెమెరా ద్వారా పిల్లలను, వారి అటెండెన్స్ పేరెంట్స్క వెళ్లేలా చూస్తుండగా, రెండోది ఫ్యాకల్టీ మానిటరింగ్ కోసం ఉపయోగపడుతుందని తెలిపారు. తరగతి గదిలో బోధన పూర్తయిన వెంటనే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక ‘క్లిక్కర్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులు ఆ రోజు పాఠాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో అప్పటికప్పుడే అంచనా వేసి తక్షణ పరిష్కారాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే విద్యార్థుల పురోగతిపై ప్రతి రెండు వారాలకోసారి పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ నిర్వహించి, పిల్లల సందేహాలు మరియు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్, మలక్పేట్, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, రామంతాపూర్, ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి తదితర ప్రాంతాల నుండి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మరియు లాంగ్ టర్మ్ కోర్సులలో (ఐఐటీ-జేఈఈ, నీట్) చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థులు నేరుగా దిల్? సుఖ్నగర్ బ్రాంచ్ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చునని నిర్వాహకులు తెలిపారు.

రంగారెడ్డి

కర్మన్ఘాట్ పోచమ్మ దేవస్థానంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా: కర్మంఘాట్ పోచమ్మ దేవాలయం నందు , పోచమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాధవ నగర్ కాలనీవాసులు, కర్మన్ఘట్ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అదేవిధంగా భక్తులు అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి, మేళ తాళాలతో, పోతురాజులతో విన్యాసాలతో, శివసత్తుల నాట్యాలతో, అధిక సంఖ్యలో వచ్చి బోనాల సమర్పించి, వారు మొక్కులను చెల్లించుకొని,పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాధవ నగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎరుకల విశ్వనాథ్ గౌడ్, చేగోని మల్లేష్ గౌడ్, జగదీష్ గౌడ్, జై ప్రసాద్ రెడ్డి, పాలెం శ్రీకాంత్, ఓం ప్రకాష్, లోతుకుంట రఘు గౌడ్, చిన్న మధు రాయిని రాజు వారు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.