Friday, 2 October 2026

Tag: ఎల్బీనగర్

రంగారెడ్డి

శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ₹37,100కు లడ్డూ వేలం దక్కించుకున్న ఆశిష్ కుమార్

ఎల్బీనగర్: చైతన్యపురి, ఫణిగిరి కాలనీలో శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో చైతన్యపురి, ఫణిగిరి కాలనీలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 14 రోజులుగా చైతన్యపురి నుంచి సరూర్‌నగర్ వరకు వివిధ కార్యక్రమాలు, స్వామివారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి ప్రసాదమైన లడ్డూను వేలం పాట నిర్వహించగా, ఆశిష్ కుమార్ రూ.37,100కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆశిష్ కుమార్ మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో వరుసగా మూడోసారి స్వామివారి లడ్డూను వేలంలో దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృపతో ప్రతి సంవత్సరం ఇలాగే వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకుంటానని తెలిపారు. గత 14 రోజులుగా నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీ వినాయక భక్త సమాజ్ నిర్వాహకులు తెలిపారు.

రంగారెడ్డి

ఫణిగిరి కాలనీలో ఘనంగా వినాయక లడ్డూ వేలం

ఎల్బీనగర్: చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, దీప్తి రెసిడెన్సీ ఎదురుగా బాల్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన వినాయక లడ్డూ బహిరంగ వేలం భక్తుల ఉత్సాహం మధ్య కోలాహలంగా సాగింది. వేలం పాటలో ఫణిగిరి కాలనీకి చెందిన భూసన్ వీరబాబు కుటుంబ సభ్యులు భూసన్ శ్రీలత, భూసన్ సృజన, భూసన్ వర్షిత్ కలిసి అత్యధికంగా రూ.14,500కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా భూసన్ వర్షిత్ మాట్లాడుతూ, తమ కాలనీ పిల్లలంతా కలిసి గత పదేళ్లుగా వినాయక చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, పిల్లల చదువులు, భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, యూత్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రంగారెడ్డి

నాగోల్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సఖి బజార్’ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్

నాగోల్: నాగోల్‌లోని పీఎంఆర్ కన్వెన్షన్‌లో ‘సఖి బజార్’ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీగిరి తరుణి, శ్రీగిరి వెంకట మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్ ఉత్పత్తులు, చీరలు, జ్యువెలరీ, హోమ్ అప్లయన్సెస్ తదితర వస్తువులతో మొత్తం 88 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ‘సఖి బజార్’ 29వ సీజన్‌గా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రూ.2 వేలకే ఆరు చీరలు, కాంచీ చీరలపై ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్, రూ.10 వేల విలువైన ఇమిటేషన్ జ్యువెలరీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్, రూ.10 వేల చీరల కొనుగోలుపై హోమ్ అప్లయన్సెస్ ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.నాగోల్ పరిసర ప్రాంతాల మహిళలు, ఫ్యాషన్ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.తదుపరి ప్రదర్శన: ‘సఖి బజార్’ తదుపరి ఎగ్జిబిషన్ అక్టోబర్ 3, 4 తేదీల్లో బండ్లగూడలోని సన్‌సిటీ కేకే కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రంగారెడ్డి

80 ఏళ్ల ఎస్టీయూటీఎస్‌ఏ ప్రస్థానం అభినందనీయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

నాగోల్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 80 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించడం అభినందనీయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కోసం ఎస్టీయూటీఎస్‌ఏ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో ఎస్టీయూటీఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ వసంత వేడుకలకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీయూటీఎస్‌ఏ నాయకులు, ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారిని ఎస్టీయూటీఎస్‌ఏ నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

రంగారెడ్డి

మమతా నగర్‌లో ఘనంగా శ్రీ ముద్ర సారీస్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు

నాగోల్: నాగోల్ మమతా నగర్‌లో శ్రీ ముద్ర సారీస్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ గణేష్ స్వామివారి లడ్డూ వేలం పాట భక్తులు, స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. మొదటి లడ్డూను హిమజ రూ.2,16,000లకు దక్కించుకోగా, రెండో లడ్డూను నాగర్ కర్నూల్–మంగళపల్లికి చెందిన రాంరెడ్డి రూ.46,116లకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ముద్ర సారీస్ ఫౌండర్, చైర్మన్ గంగిశెట్టి ఉపేందర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఉత్సవ నిర్వాహకులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఆద్యంతం భక్తి వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది.

రంగారెడ్డి

విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ

కొత్తపేట: విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని మేకల సత్యనారాయణ అన్నారు. కొత్తపేట గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యుడు, మోహన్‌నగర్ అభివృద్ధి కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి మేకల చిత్తయ్య, మేకల చిలుకమ్మ వర్ధంతి సందర్భంగా శ్రీ మేకల చిలుకమ్మ–చిత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం మోహన్‌నగర్ ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు భోజన ప్లేట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్, మోహన్‌నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్టా ఆంజనేయులు చేతుల మీదుగా విద్యార్థులకు భోజన ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల చదువుతో పాటు వారి సౌకర్యాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా భోజన ప్లేట్లను అందించడం ద్వారా మేకల చిలుకమ్మ–చిత్తయ్య జ్ఞాపకాలను కొనసాగించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ట్రస్ట్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సునీత, సంధ్య, శైలజ, ఐశ్వర్య, సునీతతో పాటు నాయకులు పార్శపు శ్రీధర్, సంగిపేట నరేష్, మురళీధర్, చిరంజీవి, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు.. లడ్డూను రూ.1.83 లక్షలకు కైవసం చేసుకున్న యశ్వంత్

ఎల్బీనగర్: శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు రెండో సంవత్సరం ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ ప్రసాదం వేలం పాటలో అసోసియేషన్ అధ్యక్షుడు యశ్వంత్ రూ.1,83,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అలాగే వెండి నాణెం వేలంలో కమిటీ సభ్యుడు చందు రూ.71,001లకు సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు యశ్వంత్ మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఐక్యంగా ముందుకు వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ట్రెజరర్ రాహుల్, కమిటీ సభ్యులు చందు, అఖిల్, రేవంత్, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

గణనాథుని లడ్డూకు భారీ డిమాండ్.. రూ.8.82 లక్షలకు దక్కించుకున్న జె. సునీత

నాగోల్: నాగోల్‌లోని సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కళ్ళం వెంకటేశ్వర రెడ్డి, చైర్ పర్సన్ రాజేశ్వరి దంపతుల నేతృత్వంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ ప్రసాదం వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. సంస్థ మార్కెటింగ్ లీడర్ జె. సునీత రూ.8,82,000లకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గణేశుడి ఆశీస్సులతో అందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. కళ్ళం వెంకటేశ్వర రెడ్డి, రాజేశ్వరి దంపతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై గణనాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అడ్మిన్ అండ్ సీఈఓ, సిబ్బంది, లీడర్లు, మార్కెటింగ్ సహచరులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం గణనాథుని నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించి ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు.

రంగారెడ్డి

నాగులపల్లిలో ఘనంగా మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. ముఖ్యులకు ఘన సన్మానం

కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలో శ్రీ మహా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం గ్రామ పెద్దలు పల్లా భాస్కర్‌రెడ్డి–పుల్లమ్మ దంపతుల కుమారులు పల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మధురెడ్డిలను వినాయక విగ్రహ దాతలు, అన్నదాన వితరణ దాతలుగా ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. పల్లా భాస్కర్‌రెడ్డి నివాసం వద్ద ప్రతిష్ఠించిన వినాయకుని సన్నిధిలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు కార్యక్రమానికి సహకరించిన ముఖ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పల్లా భాస్కర్‌రెడ్డి కుమారులు మాట్లాడుతూ యూత్ సభ్యులు, గ్రామస్థులు సమష్టిగా కలిసిమెలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన భక్తులు, గ్రామస్థులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ఐకమత్యంతో నిర్వహించాలని ఆకాంక్షించారు.

రంగారెడ్డి

శివపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

మన్సూరాబాద్, సాయినగర్ కాలనీ, మన్సూరాబాద్‌లో శివపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శివపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 11 రోజుల పాటు ప్రతిరోజూ ప్రత్యేక పూజలతో పాటు చిన్నారులు, యువత, భక్తుల కోసం పాటల పోటీలు, వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శివపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు కళ్యాణ్, వంశీ, శ్రీను, గోపి, గణేష్, తనయ్, ఆకాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.