Monday, 28 September 2026
  • Home  
  • 80 ఏళ్ల ఎస్టీయూటీఎస్‌ఏ ప్రస్థానం అభినందనీయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
- రంగారెడ్డి

80 ఏళ్ల ఎస్టీయూటీఎస్‌ఏ ప్రస్థానం అభినందనీయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

నాగోల్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 80 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించడం అభినందనీయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కోసం ఎస్టీయూటీఎస్‌ఏ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో ఎస్టీయూటీఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ వసంత వేడుకలకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీయూటీఎస్‌ఏ నాయకులు, ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారిని ఎస్టీయూటీఎస్‌ఏ నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

నాగోల్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 80 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించడం అభినందనీయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కోసం ఎస్టీయూటీఎస్‌ఏ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో ఎస్టీయూటీఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ వసంత వేడుకలకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీయూటీఎస్‌ఏ నాయకులు, ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారిని ఎస్టీయూటీఎస్‌ఏ నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.