Monday, 17 August 2026

Tag: జనగామ

జనగాం

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కారించాలి :జిల్లా కలెక్టర్

*ప్ర‌జావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి -జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* ————————– జనగామ, ఆగష్టు 17,పున్నమి ప్రతినిధి : ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో క‌లిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా *(259)* అర్జీలను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు కేటాయిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు. *ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి* జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ కు చెందిన నల్ల సుజాత, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సహాయం కొరకు మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు. ఇటిక్యాలపల్లి గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన సుంకె రాములమ్మ, తన పది గుంటల భూమికి సర్వే నిర్ణయించి, హద్దు రాళ్లు పాతించారని, కానీ తన భూమి పక్కన ఉన్న వారు వాటిని తీసేయడం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసియున్నారు. పెద్దమడ్డూర్ గ్రామం, దేవరుప్పుల మండలానికి చెందిన గనుపాక సునీత, తాను నిరుపేద కుటుంబానికి చెందినదని, ఈ మేరకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు. పాలకుర్తి గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన మామిండ్ల రాణి, తాము పేదవారమని, రేషన్ కార్డులో వచ్చే బియ్యం మాత్రమే తమకు ఆధారమని, కావున రేషన్ కార్డులో తమ పేర్లను యాడ్ చేయగలరని, రేషన్ కార్డు మంజూరు చేయాలని విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌నైన‌ది. మీదికొండ గ్రామం, ఘనపూర్ (స్టేషన్) మండలానికి చెందిన గాదెర ఎల్లయ్య, తాము నిరుపేద కుటుంబం అని, రోజూ వారి కూలి పని చేసుకుంటామని, పంట రుణం మాఫీ కాలేదని, ఈ మేరకు పంట రుణం మాఫీ చేయుట కోసం దరఖాస్తును స‌మ‌ర్పించినారు. ఈ ప్ర‌జావాణిలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

జనగాం

అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాప్ లు ఏర్పాటు చేయాలి -బిజెపి జిల్లా శాఖ డిమాండ్

అంగన్వాడీ కేంద్రాలు,రేషన్ షాప్ లు ఏర్పాటు చేయాలి :బిజెపి జనగామ జిల్లా శాఖ డిమాండ్ ——————————— జనగామ,ఆగష్టు 17,పున్నమి ప్రతినిధి : జనగామ ఆర్డీవో గారికి బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్ మెమొరెంట్ ఇవ్వడం జరిగింది పట్టణంలో రెండు మూడు నాలుగు వార్డులలో అంగన్వాడి కేంద్రాలు అలాగే రేషన్ షాపులు గత కొంతకాలంగా లేనందున ఈ వార్డులలో తక్షణమే రేషన్ షాపులను అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి వార్డు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దూసర శివకృష్ణ ఎండోమెంట్ కన్వీనర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

కలెక్టరేట్ ప్రాంగణంలో ఇండిపెండెన్స్ గార్డెన్ కు శ్రీకారం

*కలెక్టరేట్ ప్రాంగణంలో ‘ఇండిపెండెన్స్ గార్డెన్’కు శ్రీకారం* ———————————————– జనగామ, ఆగష్టు 15,పున్నమి ప్రతినిధి s *స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా మామిడి తోట.. భవిష్యత్ తరాలకు పచ్చని కానుక* స్వేచ్ఛా భారతాన్ని మరింత సుసంపన్నంగా, ఆరోగ్యవంతంగా, పచ్చదనంతో నిండిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బాధ్యతలో ప్రకృతి పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. మనం నేడు నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, చల్లని నీడ, పండ్లు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఒక చిన్న మొక్కను నాటడం అంటే కేవలం ఒక చెట్టుకు జీవం పోయడం కాదు.. భావితరాల భవిష్యత్తుకు భరోసా కల్పించడం. మొక్క నాటడం ఒక చిన్న కార్యక్రమంలా కనిపించినా.. దాని వెనుక ఉన్న ఆలోచన ఎంతో గొప్పది. ఈ రోజు నాటిన చిన్న మొక్క రేపు మహా వృక్షంగా ఎదిగి నీడనిస్తుంది. పూలు, పండ్లు అందిస్తుంది. పక్షులకు ఆవాసమవుతుంది. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు “మన కోసం ఎవరో ఒకరు ఒక మొక్క నాటారు” అనే మధురమైన జ్ఞాపకాన్ని మిగుల్చుతుంది. జిల్లా కలెక్టరేట్ వెనుక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఇండిపెండెన్స్ గార్డెన్’ (మామిడి పండ్ల తోట) ఈ ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచింది. *కలెక్టర్ ప్రత్యేక చొరవతో పచ్చని ఆలోచనకు రూపం* కలెక్టరేట్ అనేది ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే పరిపాలనా కేంద్రం. అలాంటి ప్రాంగణంలోనే పచ్చదనాన్ని పెంపొందించేలా మామిడి పండ్ల తోటను ఏర్పాటు చేయడం ఒక వినూత్న ఆలోచనగా నిలిచింది. *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ప్రత్యేక చొరవతో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఖాళీ ప్రదేశాలను నిరుపయోగంగా వదిలేయకుండా వాటిని పచ్చని ప్రదేశాలుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చనే సందేశాన్ని ఈ తోట అందిస్తోంది. *మామిడి మొక్కలో దాగిన మధురమైన సందేశం* మామిడి చెట్టు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగినది. వేసవిలో చల్లని నీడనిచ్చే చెట్టు.. కాలానుగుణంగా పండ్లను అందించే జీవ వనరు.. ఎన్నో జీవరాశులకు ఆశ్రయం కల్పించే ప్రకృతి సంపద. నేడు నాటిన చిన్న మొక్క కొన్ని సంవత్సరాల తర్వాత విస్తారమైన కొమ్మలతో ఎదిగి, పచ్చని ఆకులతో కళకళలాడుతూ, మామిడి పండ్లను అందిస్తుంది. అందుకే ఈ తోటలో నాటిన ప్రతి మొక్క ఒక సాధారణ మొక్క కాదు.. ఒక జ్ఞాపకం, ఒక బాధ్యత, ఒక భవిష్యత్ ఆశ. *పండ్లలో రారాజు “మామిడి”* మామిడి మొక్కను ఎంచుకోవడానికి ప్రధాన కారణం “పండ్లలో రారాజు మామిడి” అనే ప్రత్యేకత. మన దేశంలో మామిడికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రుచికరమైన పండును అందించడంతో పాటు, మామిడి చెట్టు దీర్ఘకాలం నీడను, పచ్చదనాన్ని అందిస్తుంది. అదే విధంగా, ఇండిపెండెన్స్ గార్డెన్‌లో మామిడి మొక్కను నాటడం భవిష్యత్ తరాలకు అభివృద్ధి, పచ్చదనం, ప్రకృతి పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. *పచ్చదనం పరిపాలనలో భాగం కావాలి* ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పచ్చగా ఉంచడం, పండ్ల మొక్కలను పెంచడం, ప్రకృతితో అనుసంధానమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఉద్యోగులు, సందర్శకుల్లో కూడా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుంది. *భావితరాల పచ్చని భవిష్యత్తుకు బాటలు* 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిలతో కలిసి ముఖ్య అతిథి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య* ‘ఇండిపెండెన్స్ గార్డెన్’ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పండ్ల మొక్కను నాటి గార్డెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.