ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాలను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో AERO (అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు) అధికారులతో కలిసి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మ్యాపింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేయాలని, ప్రతి ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితంగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫీల్డ్ స్థాయిలో పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విధులు నిర్వహించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



