నాగర్కర్నూల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) నాగర్కర్నూల్ జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా రామార్జున్, ప్రధాన కార్యదర్శిగా తారా సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి సంఘం నాయకులు, విద్యార్థులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


