Tuesday, 26 May 2026
  • Home  
  • పెనుకొండలో ఘోర ప్రమాదం | లారీ క్యాబిన్‌లో డ్రైవర్ సజీవ దహనం
- News

పెనుకొండలో ఘోర ప్రమాదం | లారీ క్యాబిన్‌లో డ్రైవర్ సజీవ దహనం

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ నుండి బెంగళూరు వెళ్తున్న గోధుమల లోడు లారీ, ముందున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ కిరణ్ (35) ఇరుక్కుపోయాడు. వెంటనే లారీకి మంటలు అంటుకోగా, అతనిని కాపాడేందుకు క్లీనర్ జనార్దన్ శతవిధాలా ప్రయత్నించాడు. అయితే మంటలు తీవ్రమవ్వడంతో కిరణ్ కళ్ళముందే సజీవ దహనమయ్యాడు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడగా, ప్రమాదానికి కారణమైన మరో లారీ సిబ్బంది పారిపోయారు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ నుండి బెంగళూరు వెళ్తున్న గోధుమల లోడు లారీ, ముందున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ కిరణ్ (35) ఇరుక్కుపోయాడు.
వెంటనే లారీకి మంటలు అంటుకోగా, అతనిని కాపాడేందుకు క్లీనర్ జనార్దన్ శతవిధాలా ప్రయత్నించాడు. అయితే మంటలు తీవ్రమవ్వడంతో కిరణ్ కళ్ళముందే సజీవ దహనమయ్యాడు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడగా, ప్రమాదానికి కారణమైన మరో లారీ సిబ్బంది పారిపోయారు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.