Friday, 11 September 2026
  • Home  
  • RBSK వైద్య శిబిరంలో విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్లు
- ASIFABAD

RBSK వైద్య శిబిరంలో విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్లు

మరో 15 రోజుల్లో మరోసారి వైద్య శిబిరం ఆసిఫాబాద్, పున్నమి ప్రతినిధి, తేది11.09.2026: తెలంగాణ వైద్య విధాన పరిషత్, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు RBSK వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా RBSK వైద్యులు డాక్టర్ నరేందర్ మరియు వైద్య బృందం విద్యార్థులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టుల ఆధారంగా దృష్టి సమస్యలు ఉన్న 20 మంది విద్యార్థులకు ఉచితంగా తగిన కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ, మరో 15 రోజుల్లో తిరిగి RBSK వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ వైద్య శిబిరం ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, రాజన్న, గురుకుల నర్సింగ్ ఆఫీసర్ ముదిమడుగుల శ్యామ్ చందర్, అధ్యాపకులు కోసరి మహేష్, రాజకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరో 15 రోజుల్లో మరోసారి వైద్య శిబిరం
ఆసిఫాబాద్, పున్నమి ప్రతినిధి, తేది11.09.2026:
తెలంగాణ వైద్య విధాన పరిషత్, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు RBSK వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
జిల్లా RBSK వైద్యులు డాక్టర్ నరేందర్ మరియు వైద్య బృందం విద్యార్థులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టుల ఆధారంగా దృష్టి సమస్యలు ఉన్న 20 మంది విద్యార్థులకు ఉచితంగా తగిన కళ్లజోళ్లు అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ, మరో 15 రోజుల్లో తిరిగి RBSK వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ వైద్య శిబిరం ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, రాజన్న, గురుకుల నర్సింగ్ ఆఫీసర్ ముదిమడుగుల శ్యామ్ చందర్, అధ్యాపకులు కోసరి మహేష్, రాజకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.