ఖమ్మం నగరంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు బంద్ నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని బ్యాంకులను మూసివేశారు. అనంతరం నెహ్రునగర్ నుంచి ఇల్లందు క్రాస్‌రోడ్ వరకు ఉద్యోగులు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. క్లరికల్ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. అలాగే ఐటీ నుంచి నాలుగు శాతం మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలను కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.



