*కోటలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 కోట మండలం*
నెల్లూరు జిల్లా కోట మండలం‘సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు వారి ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని కోట ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణమ్మ సూచించారు. కోట పట్టణంలోని మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పౌష్టికాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాల్లో లభించే పోషక విలువలను వివరించారు. ‘పోషణ మాసం–మన అంగన్వాడి–మన బాధ్యత’ అనే సందేశంతో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు చెంగమ్మ, ఝాన్సీ, ఆశ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలు పాల్గొన్నారు.



