రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
పూరగుట్టలో రూ.40 లక్షలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన.
మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18/09/2026.
మైలవరం శివారు పూరగుట్టలో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. పూరుగుట్టలో డి.ఎం.ఎఫ్ నిధులు రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ.. పూరగుట్టలో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిత్యజీవితంలో ఇబ్బందులు లేకుండా రహదారులు తదితర మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీపం–2.0, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.
మైలవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అవసరమైన రహదారులను గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
పూరగుట్టలో అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలగడంతో పాటు ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా, నిర్దేశిత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




