Wednesday, 5 August 2026
  • Home  
  • (PMFBY) పథకానికి మరో 11 రోజులే.. రైతులు వెంటనే బీమా నమోదు చేసుకోవాలి
- అనకాపల్లి

(PMFBY) పథకానికి మరో 11 రోజులే.. రైతులు వెంటనే బీమా నమోదు చేసుకోవాలి

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 4 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకం కింద పంట బీమా నమోదు చేసుకునేందుకు మరో 11 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని మండల వ్యవసాయాధికారి, మండల అభివృద్ధి అధికారి రైతులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక మీ సేవ–కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి, రామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. మండలంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన 8,474 మంది రైతులు తమ బ్యాంకుల ద్వారా తప్పనిసరిగా పంట బీమా నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. రుణం పొందని రైతులు సమీప సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. నమోదు కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ లేదా 1-బి, బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా పంట బీమా నమోదు చేసుకుని ప్రభుత్వ రక్షణను పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి దీపిక, డిప్యూటీ ఎంపీడీవో అనంత్ నాగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 4 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకం కింద పంట బీమా నమోదు చేసుకునేందుకు మరో 11 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని మండల వ్యవసాయాధికారి, మండల అభివృద్ధి అధికారి రైతులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక మీ సేవ–కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి, రామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.
మండలంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన 8,474 మంది రైతులు తమ బ్యాంకుల ద్వారా తప్పనిసరిగా పంట బీమా నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. రుణం పొందని రైతులు సమీప సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు.
నమోదు కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ లేదా 1-బి, బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా పంట బీమా నమోదు చేసుకుని ప్రభుత్వ రక్షణను పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి దీపిక, డిప్యూటీ ఎంపీడీవో అనంత్ నాగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.