వైఎస్సార్ నగర్, నందమూరి నగర్ వాసులకు రాకపోకలకు ఆధారమైన కుందూ నది వంతెనను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. వర్షాల వేళ నది ప్రవాహం పెరిగినప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించేలా వంతెన పటిష్టత, అభివృద్ధి పనులపై తక్షణమే నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, తహసీల్దార్ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కుందూ వంతెనను పరిశీలించిన మంత్రి ఫరూక్.. రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ఆదేశం!