నంద్యాల : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న నంద్యాలలో నిర్వహించే వామపక్ష పార్టీల ర్యాలీని జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్ న్యూ డెమోక్రసీ) నాయకులు పిలుపునిచ్చారు.
నంద్యాలలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, తొలగించిన ఓటర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పలువురు వామపక్ష, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలి
నంద్యాల : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న నంద్యాలలో నిర్వహించే వామపక్ష పార్టీల ర్యాలీని జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్ న్యూ డెమోక్రసీ) నాయకులు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, తొలగించిన ఓటర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పలువురు వామపక్ష, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

