పున్నమి, అనంతపురం: తాడిపత్రి నుంచి చుక్కలూరు వెళ్లే దారిలో పెన్నా నదిపై ఉన్న వంతెన కింద గుట్టలుగా గ్రానైట్ వ్యర్థాలు పడవేస్తున్నారు. చుక్కలూరు రోడ్డులో చాలా ఎక్కువ సంఖ్యలో గ్రానైట్ పాలిషింగ్, కటింగ్ యూనిట్లున్నాయి. గ్రానైట్ పలకలను ముక్కలు చేసినప్పుడు చిన్న చిన్న అంచులు మిగులుతుంటాయి. వాటిని ట్రాక్టర్లు మీద ఎక్కించుకుని ఇలా పెన్నా నది వంతెన స్తంభాల కింద పడవేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు వీటిపై ఉన్న దుమ్ము, ధూళి, గ్రానైట్ వ్యర్థాల పొడి అన్నీ కలసి నీళ్లను కలుషితం చేస్తున్నాయి.


