Friday, 25 September 2026
  • Home  
  • నంద్యాలలో ఘనంగా ‘జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా’: కలెక్టర్ రాజ కుమారి గనియా
- నంద్యాల

నంద్యాలలో ఘనంగా ‘జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా’: కలెక్టర్ రాజ కుమారి గనియా

నంద్యాల : జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘శ్రీ అన్న’ జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా మరియు శిక్షణా కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజ కుమారి గనియా మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు, పోషకాహార లోపాన్ని నివారించేందుకు రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వరి, జొన్నల స్థానంలో 50% మేర చిరుధాన్యాలు సాగు చేయాలని, ప్రకృతి వ్యవసాయం, ‘ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్’ (PMDS) విధానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ నిరుద్యోగులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మంజూరుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.అనంతరం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, చిరుధాన్యాలతో శరీర అవయవాల ప్రాముఖ్యతను వివరించే ప్రత్యేక స్టాళ్లను కలెక్టర్ పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. ఈ మేళాలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, మహిళా సంఘాల సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.