Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: పుకార్లు నమ్మవద్దన్న రెవెన్యూ అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: పుకార్లు నమ్మవద్దన్న రెవెన్యూ అధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • మేడ్చల్ (పున్నమి రిపోర్ట్ - సందీప్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ లబ్ధిదారులందరికీ చేరేవరకు నిరంతరం కొనసాగుతుందని, దళారులు మరియు మధ్యవర్తుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని రెవెన్యూ అధికారులు సూచించారు.
  • ​మేడ్చల్ జిల్లాలోని అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను కేవలం రెండు గంటలు మాత్రమే పంపిణీ చేస్తారంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా పుకార్లు ప్రచారం చేశారు.
  • ఈ అసత్య ప్రచారాన్ని నిజమని నమ్మిన పలువురు బాధితులు తమ ఉద్యోగాలకు, పనులకు సెలవులు పెట్టి కార్డుల కోసం భారీ సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీరారు.

మేడ్చల్ (పున్నమి రిపోర్ట్ – సందీప్):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ లబ్ధిదారులందరికీ చేరేవరకు నిరంతరం కొనసాగుతుందని, దళారులు మరియు మధ్యవర్తుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని రెవెన్యూ అధికారులు సూచించారు.
​మేడ్చల్ జిల్లాలోని అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను కేవలం రెండు గంటలు మాత్రమే పంపిణీ చేస్తారంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా పుకార్లు ప్రచారం చేశారు. ఈ అసత్య ప్రచారాన్ని నిజమని నమ్మిన పలువురు బాధితులు తమ ఉద్యోగాలకు, పనులకు సెలవులు పెట్టి కార్డుల కోసం భారీ సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీరారు.
​ఒక్కసారిగా జనాలు అధిక సంఖ్యలో తరలిరావడంతో, తోపులాట జరగకుండా అధికారులు కొన్ని కార్డులు పంపిణీ చేసిన అనంతరం ప్రక్రియను తాత్కాలికంగా ముగించాల్సి వచ్చింది.
​ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ (MRO) అధికారులు మాట్లాడుతూ… రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ అనేది ఒక్కరోజుతో ముగిసేది కాదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *