మేడ్చల్ (పున్నమి రిపోర్ట్ – సందీప్):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ లబ్ధిదారులందరికీ చేరేవరకు నిరంతరం కొనసాగుతుందని, దళారులు మరియు మధ్యవర్తుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని రెవెన్యూ అధికారులు సూచించారు.
మేడ్చల్ జిల్లాలోని అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను కేవలం రెండు గంటలు మాత్రమే పంపిణీ చేస్తారంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా పుకార్లు ప్రచారం చేశారు. ఈ అసత్య ప్రచారాన్ని నిజమని నమ్మిన పలువురు బాధితులు తమ ఉద్యోగాలకు, పనులకు సెలవులు పెట్టి కార్డుల కోసం భారీ సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీరారు.
ఒక్కసారిగా జనాలు అధిక సంఖ్యలో తరలిరావడంతో, తోపులాట జరగకుండా అధికారులు కొన్ని కార్డులు పంపిణీ చేసిన అనంతరం ప్రక్రియను తాత్కాలికంగా ముగించాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ (MRO) అధికారులు మాట్లాడుతూ… రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ అనేది ఒక్కరోజుతో ముగిసేది కాదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: పుకార్లు నమ్మవద్దన్న రెవెన్యూ అధికారులు
మేడ్చల్ (పున్నమి రిపోర్ట్ – సందీప్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ లబ్ధిదారులందరికీ చేరేవరకు నిరంతరం కొనసాగుతుందని, దళారులు మరియు మధ్యవర్తుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని రెవెన్యూ అధికారులు సూచించారు. మేడ్చల్ జిల్లాలోని అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను కేవలం రెండు గంటలు మాత్రమే పంపిణీ చేస్తారంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా పుకార్లు ప్రచారం చేశారు. ఈ అసత్య ప్రచారాన్ని నిజమని నమ్మిన పలువురు బాధితులు తమ ఉద్యోగాలకు, పనులకు సెలవులు పెట్టి కార్డుల కోసం భారీ సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీరారు. ఒక్కసారిగా జనాలు అధిక సంఖ్యలో తరలిరావడంతో, తోపులాట జరగకుండా అధికారులు కొన్ని కార్డులు పంపిణీ చేసిన అనంతరం ప్రక్రియను తాత్కాలికంగా ముగించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ (MRO) అధికారులు మాట్లాడుతూ… రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ అనేది ఒక్కరోజుతో ముగిసేది కాదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

