Sunday, 27 September 2026
  • Home  
  • దివ్యాంగులకు 57 ఉచిత మోటారు మూడుచక్రముల వాహనాల పంపిణీ
- తూర్పు గోదావరి

దివ్యాంగులకు 57 ఉచిత మోటారు మూడుచక్రముల వాహనాల పంపిణీ

పున్నమి న్యూస్ ప్రతినిధి రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా దివ్యాంగులకు 57 ఉచిత మోటారు త్రిచక్ర వాహనాల పంపిణీ దివ్యాంగులు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల్లో భాగంగా మోటారు త్రిచక్ర వాహనాలను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో దివ్యాంగులకు ఉచిత మోటారు త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఆర్థోపెడికల్ వైకల్యం కలిగిన 57 మంది లబ్ధిదారులను ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసి మోటారు త్రిచక్ర వాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం పింఛన్లు, సహాయక పరికరాలు, త్రిచక్ర వాహనాలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. శారీరక పరిమితులను అధిగమించి స్వయం ఉపాధి, ఉద్యోగం, విద్య తదితర రంగాల్లో ముందుకు సాగుతున్న దివ్యాంగుల పట్టుదల, ధైర్యం, సానుకూల దృక్పథాన్ని అభినందించారు. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ పనిచేయడానికి వెనుకాడే వారికి దివ్యాంగుల శ్రమ, నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగుల ప్రత్యేక అవసరాల సంఘానికి భవనం ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు స్వయం సమృద్ధిగా జీవించేందుకు ప్రభుత్వం అందిస్తున్న మోటారు త్రిచక్ర వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రాకపోకల కోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి తగ్గి, స్వయం ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం తదితర కార్యకలాపాలను మరింత స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు ఈ వాహనాలు దోహదపడతాయన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ మోటారు త్రిచక్ర వాహనాల ద్వారా దివ్యాంగుల రాకపోకల పరిధి పెరిగి, స్వయం ఉపాధి చేసుకునేవారు మరింత మంది వినియోగదారులను చేరుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుని కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో దివ్యాంగ విద్యార్థులు, వ్యక్తులకు టాబ్లెట్లు, టెక్స్ట్-టు-స్పీచ్ వంటి అనేక సహాయక సాంకేతిక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యాలయం, సంస్థ, కంపెనీలో దివ్యాంగులకు సమాన అవకాశాలు, సులభ ప్రాప్యత కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. దివ్యాంగులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైన పరికరాలు, ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ఏపీడీఏఎస్‌సీఏసీ ఛైర్మన్ గుడిపూడి నారాయణస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. దివ్యాంగుల స్వావలంబన, ఆర్థిక సాధికారత, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మోటారు త్రిచక్ర వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులు తమ దైనందిన అవసరాలను స్వయంగా నిర్వహించుకోవడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన లబ్ధిదారు వెలిగండ్ల వీరవేణి మాట్లాడుతూ గతంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలపై ఆధారపడాల్సి వచ్చేదని, దీంతో రోజువారీగా అధిక మొత్తంలో రవాణా ఖర్చులు భరించాల్సి వచ్చేదని తెలిపారు. ముఖ్యమంత్రి ద్వారా మోటారు ద్విచక్ర వాహనం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్నేహితుల సహాయంతో దరఖాస్తు చేసుకున్నానని, ప్రస్తుతం వాహనం నడపడం పూర్తిగా రాకపోయినా త్వరలో నేర్చుకుని స్వతంత్రంగా ప్రయాణిస్తానని చెప్పారు. ఎం.ఏ., బి.ఎడ్. పూర్తి చేసి ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నానని, తన చదువుకు తల్లి ఎంతో సహకరించారని తెలిపారు. స్వయం సమృద్ధిగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు. రంగంపేటకు చెందిన లబ్ధిదారు బాలాజీ మాట్లాడుతూ బయటకు వెళ్లి అవసరమైన సామగ్రి తెచ్చుకోవడంలో తాను ఇబ్బందులు పడేవాడినని, ప్రభుత్వం అందించిన మోటారు త్రిచక్ర వాహనం తనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వాహనం ద్వారా తన కార్యకలాపాలను మరింత విస్తరించుకుని అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. వాహనం అందించిన ప్రభుత్వం, కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, అధికారులు మరియు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. *పథకం వివరాలు* దివ్యాంగుల దైనందిన జీవన పరిస్థితులను మెరుగుపరచి, వారు స్వయం సమృద్ధి సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.10, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ, తేదీ 22.03.2021 ద్వారా హెల్మెట్‌తో కూడిన మూడు చక్రాల మోటారు పెట్రోల్ స్కూటర్లను ఉచితంగా అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు, 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం, 10వ తరగతి ఉత్తీర్ణత, వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు లేదా రైస్ కార్డు కలిగి ఉండటంతో పాటు వాహనం నడపడానికి చేతులు అనుకూలంగా ఉన్న దివ్యాంగులు అర్హులు. స్వయం ఉపాధి పొందుతున్నవారికి, ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ పథకం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు మొత్తం 70 మోటారు త్రిచక్ర వాహనాలు కేటాయించగా, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించిన పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం 57 మంది దివ్యాంగులను ఎంపిక చేశారు. రాజమహేంద్రవరం పట్టణంలో 7, రాజమహేంద్రవరం గ్రామీణంలో 7, రాజానగరంలో 8, కొవ్వూరులో 6, గోపాలపురంలో 6, అనపర్తిలో 11, నిడదవోలులో 12 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశించిన ప్రాధాన్యతలను పాటిస్తూ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితాను వాహనాల విడుదల కోసం ఏపీడీఏఎస్‌సీఏసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపనున్నట్లు సహాయ సంచాలకులు/జిల్లా మేనేజర్, ఏపీడీఏఎస్‌సీఏసీ, తూర్పుగోదావరి జిల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ కే. ఆదిత్య శర్మ, సహాయ సంచాలకులు ఎ.వై. శ్రీనివాస్, దివ్యాంగుల ప్రత్యేక అవసరాల సంఘం ప్రతినిధులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా దివ్యాంగులకు 57 ఉచిత మోటారు త్రిచక్ర వాహనాల పంపిణీ
దివ్యాంగులు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల్లో భాగంగా మోటారు త్రిచక్ర వాహనాలను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో దివ్యాంగులకు ఉచిత మోటారు త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఆర్థోపెడికల్ వైకల్యం కలిగిన 57 మంది లబ్ధిదారులను ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసి మోటారు త్రిచక్ర వాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం పింఛన్లు, సహాయక పరికరాలు, త్రిచక్ర వాహనాలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. శారీరక పరిమితులను అధిగమించి స్వయం ఉపాధి, ఉద్యోగం, విద్య తదితర రంగాల్లో ముందుకు సాగుతున్న దివ్యాంగుల పట్టుదల, ధైర్యం, సానుకూల దృక్పథాన్ని అభినందించారు. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ పనిచేయడానికి వెనుకాడే వారికి దివ్యాంగుల శ్రమ, నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగుల ప్రత్యేక అవసరాల సంఘానికి భవనం ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు స్వయం సమృద్ధిగా జీవించేందుకు ప్రభుత్వం అందిస్తున్న మోటారు త్రిచక్ర వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రాకపోకల కోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి తగ్గి, స్వయం ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం తదితర కార్యకలాపాలను మరింత స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు ఈ వాహనాలు దోహదపడతాయన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ మోటారు త్రిచక్ర వాహనాల ద్వారా దివ్యాంగుల రాకపోకల పరిధి పెరిగి, స్వయం ఉపాధి చేసుకునేవారు మరింత మంది వినియోగదారులను చేరుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుని కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో దివ్యాంగ విద్యార్థులు, వ్యక్తులకు టాబ్లెట్లు, టెక్స్ట్-టు-స్పీచ్ వంటి అనేక సహాయక సాంకేతిక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యాలయం, సంస్థ, కంపెనీలో దివ్యాంగులకు సమాన అవకాశాలు, సులభ ప్రాప్యత కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. దివ్యాంగులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైన పరికరాలు, ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ఏపీడీఏఎస్‌సీఏసీ ఛైర్మన్ గుడిపూడి నారాయణస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. దివ్యాంగుల స్వావలంబన, ఆర్థిక సాధికారత, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మోటారు త్రిచక్ర వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులు తమ దైనందిన అవసరాలను స్వయంగా నిర్వహించుకోవడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకునే అవకాశం కలుగుతుందన్నారు.

రాజమహేంద్రవరానికి చెందిన లబ్ధిదారు వెలిగండ్ల వీరవేణి మాట్లాడుతూ గతంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలపై ఆధారపడాల్సి వచ్చేదని, దీంతో రోజువారీగా అధిక మొత్తంలో రవాణా ఖర్చులు భరించాల్సి వచ్చేదని తెలిపారు. ముఖ్యమంత్రి ద్వారా మోటారు ద్విచక్ర వాహనం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్నేహితుల సహాయంతో దరఖాస్తు చేసుకున్నానని, ప్రస్తుతం వాహనం నడపడం పూర్తిగా రాకపోయినా త్వరలో నేర్చుకుని స్వతంత్రంగా ప్రయాణిస్తానని చెప్పారు. ఎం.ఏ., బి.ఎడ్. పూర్తి చేసి ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నానని, తన చదువుకు తల్లి ఎంతో సహకరించారని తెలిపారు. స్వయం సమృద్ధిగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు.

రంగంపేటకు చెందిన లబ్ధిదారు బాలాజీ మాట్లాడుతూ బయటకు వెళ్లి అవసరమైన సామగ్రి తెచ్చుకోవడంలో తాను ఇబ్బందులు పడేవాడినని, ప్రభుత్వం అందించిన మోటారు త్రిచక్ర వాహనం తనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

వాహనం ద్వారా తన కార్యకలాపాలను మరింత విస్తరించుకుని అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. వాహనం అందించిన ప్రభుత్వం, కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, అధికారులు మరియు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు.

*పథకం వివరాలు*

దివ్యాంగుల దైనందిన జీవన పరిస్థితులను మెరుగుపరచి, వారు స్వయం సమృద్ధి సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.10, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ, తేదీ 22.03.2021 ద్వారా హెల్మెట్‌తో కూడిన మూడు చక్రాల మోటారు పెట్రోల్ స్కూటర్లను ఉచితంగా అందించే పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ పథకం కింద 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు, 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం, 10వ తరగతి ఉత్తీర్ణత, వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు లేదా రైస్ కార్డు కలిగి ఉండటంతో పాటు వాహనం నడపడానికి చేతులు అనుకూలంగా ఉన్న దివ్యాంగులు అర్హులు. స్వయం ఉపాధి పొందుతున్నవారికి, ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ పథకం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు మొత్తం 70 మోటారు త్రిచక్ర వాహనాలు కేటాయించగా, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించిన పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం 57 మంది దివ్యాంగులను ఎంపిక చేశారు.

రాజమహేంద్రవరం పట్టణంలో 7, రాజమహేంద్రవరం గ్రామీణంలో 7, రాజానగరంలో 8, కొవ్వూరులో 6, గోపాలపురంలో 6, అనపర్తిలో 11, నిడదవోలులో 12 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశించిన ప్రాధాన్యతలను పాటిస్తూ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితాను వాహనాల విడుదల కోసం ఏపీడీఏఎస్‌సీఏసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపనున్నట్లు సహాయ సంచాలకులు/జిల్లా మేనేజర్, ఏపీడీఏఎస్‌సీఏసీ, తూర్పుగోదావరి జిల్లా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ కే. ఆదిత్య శర్మ, సహాయ సంచాలకులు ఎ.వై. శ్రీనివాస్, దివ్యాంగుల ప్రత్యేక అవసరాల సంఘం ప్రతినిధులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.