నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి. జనార్ధన్ రెడ్డిని DEO బాధ్యతల నుంచి తప్పించి, ఆయనపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు డిమాండ్ చేశారు.కర్నూలు డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా FAC బాధ్యతలు నిర్వహిస్తూ నంద్యాల జిల్లా DEOగా కూడా అదనపు బాధ్యతలు చేపట్టడం వల్ల విద్యాశాఖ పర్యవేక్షణపై ప్రభావం పడుతోందని ఆయన ఆరోపించారు. విద్యాశాఖలోని పలు అంశాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల వచ్చిన వరుస కథనాలను అధికారులు సుమోటోగా స్వీకరించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని రంగనాయుడు డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే DEOపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పించాలని కోరారు.

DEO జనార్ధన్ రెడ్డిని విధుల నుంచి తప్పించాలి