నంద్యాల మండలంలో వైసిపి బోణీ: పాఠశాల విద్యా కమిటీ ఏకగ్రీవం
నంద్యాల మండలం వెంకటేశ్వరపురం ఎంపిపి పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ ఛైర్మన్‌గా చిన్న ఓబులేషు, వైస్ ఛైర్మన్‌గా పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాఠశాల వెలుపల సంబరాలు జరుపుకొని, నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.






