Thursday, 2 July 2026
  • Home  
  • ఏటికొప్పాకలో రైతన్నకు కూటమి ప్రభుత్వం అండ… సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ ఘనం….!
- అనకాపల్లి

ఏటికొప్పాకలో రైతన్నకు కూటమి ప్రభుత్వం అండ… సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ ఘనం….!

అనకాపల్లి జిల్లా, జూలై 2 (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీగా పేరుగాంచిన ఏటికొప్పాక గ్రామంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. రైతుల సాగు వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో నాణ్యమైన వరి విత్తనాలను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నెముక అని, వ్యవసాయాభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తోందన్నారు. ప్రతి అర్హ రైతు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, రావి చలపతి, బీజేపీ నాయకులు శెన్నాంశెట్టి శ్రీను, అన్నం స్వరాజ్ రావు, నగిరెడ్డి సత్యనారాయణ, నగిరెడ్డి రమణ, సనాపతి సూరిబాబు, మొల్లేటి ప్రసాద్, మైలార్ నాగరాజు, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనకాపల్లి జిల్లా, జూలై 2 (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీగా పేరుగాంచిన ఏటికొప్పాక గ్రామంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. రైతుల సాగు వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో నాణ్యమైన వరి విత్తనాలను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నెముక అని, వ్యవసాయాభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తోందన్నారు. ప్రతి అర్హ రైతు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, రావి చలపతి, బీజేపీ నాయకులు శెన్నాంశెట్టి శ్రీను, అన్నం స్వరాజ్ రావు, నగిరెడ్డి సత్యనారాయణ, నగిరెడ్డి రమణ, సనాపతి సూరిబాబు, మొల్లేటి ప్రసాద్, మైలార్ నాగరాజు, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.