Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

ప్రకాశం

ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ కే సొంతం

ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపాలెంలో నూతనంగా నిర్మించిన దర్శి-2 సచివాలయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన అన్ని సచివాలయాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జగనన్న సారథ్యంలో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్​కే దక్కుతుందని కొనియాడారు. సచివాలయాలు అవినీతి రహితంగా ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ఉద్యోగులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్

శ్రీకాకుళం : ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 వ విడత ఇంటింటి ఫీవర్ సర్వేలో  భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్ యాప్ ను ఆశా కార్యకర్త, ఏ.ఎన్.ఎం ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తూ  స్వయంగా డౌన్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. సర్వే సమయానికి ముందు రోజు ఫీవర్  సర్వే గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు అందరూ అందుబాటులో ఉండే సమయాలలో సర్వే నిర్వహించాలని తద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.  సర్వే కార్యక్రమాన్ని ఆయా ప్రాంత ఆశా కార్యకర్త,ఏ.ఎన్.ఎం స్వయంగా నిర్వహించాలని తెలిపారు. వాలంటీర్ సర్వేలో పాల్గొని తమ మొబైల్ ఆప్ ద్వారా ఆశా, ఏ.ఎన్.ఎం చెప్పిన వివరాలు నమోదు చేయాలని అన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని గమనించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా మలేరియా,డెంగీ వంటి వ్యాధులను గూర్చి అవగాహన కలిగించి, నివారణ చర్యలు తీసుకొనే విధంగా చైతన్య పరచాలని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బంది విధిగా మాస్కు ధరించి, తగిన ఇతర రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి సర్వే వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు నేరకుగా మోబైల్ యాప్ ద్వారా ప్రతి ఇంటి సర్వేలో భాగంగా ఆ ఇంటి వద్దనే అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. తాళాలు వేసిన ఇళ్ళు ఉంటే వదిలి పెట్టరాదని, ఇంటి మనుషులు వచ్చిన వెంటనే అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా సహనం, ఓర్పుతో సర్వే చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం జిల్లాలో నేటి ఆదివారం కరోనా హెల్త్ బులిటెనను జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. మొత్తం 45601 మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా..39580 మందికి రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని చెప్పారు. ఇంకా 6021 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు.అదివారం 1937 మంది నమూనాలను పంపినట్లు తెలిపారు.ఈ రోజు కొత్తగా కేసులు నమోదు కాలేదన్నారు.కాగా ప్రస్తుతం ఐదుగురు డిశ్చార్జి అయ్యి 9మంది చికిత్స పొందుతున్నారు

చిత్తూరు

చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా.. * చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం * నిబద్ధత, అవగాహన కలిగిన పాలక మండలి * ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి   తిరుపతి,   చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో అట్టహాసంగా సాగింది. మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా మస్తాన్, ఉపాధ్యక్షులుగా కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో పద్నాలుగు మంది సభ్యులచే గౌరవ అధ్యక్షులు హోదాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం మార్కెట్ యార్డ్ వేదికగా పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. రైతు సమస్యలపై అవగాహన, పరిష్కరించడంలో నిబద్ధత కలిగిన సభ్యులు పాలకమండలి లో ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రంలోనే చంద్రగిరి మార్కెట్ యార్డ్ అతి త్వరలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతే రాజు దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎర్ర వారిపాలెం, చిన్నగొట్టి గాల్లు, చంద్రగిరి మండలాల పరిధిలోని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని పాలక మండలి సభ్యులకు తెలియజేశారు. రైతులకు 24×7 అందుబాటులో ఉంటారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ని పాలకమండలి చైర్మెన్ మస్తాన్, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి నాగలిని బహూకరించి, గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పూర్తితో రైతులకు సేవలు అందిస్తామని నూతన పాలకమండలి సభ్యులు స్పష్టం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సహదేవ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీవో రాధ తదితరులు పాల్గొన్నారు.

Featured

బిజెపి మనుబోలు మండల నూతన అధ్యక్షుడుగా ఓడూరు శ్రీనివాసులు రెడ్డి

31-05-2020మనుబోలు ( పున్నమి ప్రతినిధి)తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ.సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి అధ్యక్షతన మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో బిజెపి మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనుబోలు మండల బిజెపి అధ్యక్షుడిగా ఓడూరు శ్రీనివాసులురెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండల స్థాయిలో బిజెపి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు తనను బిజెపి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల నాయకులకు కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ నాయకులు అందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని మనుబోలు మండలం లో గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ మరియు మనుబోలు మండల బిజెపి నాయకులుచల్లా లక్ష్మయ్య ,దగ్గవోలు రామిరెడ్డి ,ముప్పవరపు చిన్న, ఇరగ రాజ అంకయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured

మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో 300కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ..

31-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో షుమారు 300కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే త్రాగు నీరు, మజ్జిగ చలివేంద్రం కూడా ప్రారంభోత్సవం జరిగింది. మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెంకటరమణ దాతగా వ్యవహరించారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని.. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, ఏకొల్లు శ్రీనివాసులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు కు ఘనంగా సన్మానం. ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి

 శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరం లో ఆదివారం పదవీ విరమణ పొందిన అదనపు ఎస్పీ శ్రీ జి.గంగరాజు, డిస్పీ  టి.పాల్గుణరావు, Offce Supdt., పి. రాజేశ్వరరావు, AR RSI జి. నాగరాజు, AR హెడ్ కానిస్టేబుల్  ఆర్ సి హెచ్ ప్రధాని గార్లను ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి వారు భౌతిక  దూరం పాటిస్తూ దుశ్శాలువ తో సన్మానం చేసి, చిరు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ వారు మాట్లాడుతూ, గంగరాజు గారు మృదు స్వభావని, అంకిత భావంతో పనిచేసి, తనదైన శైలిలో క్రైమ్ కేసులు ను ఎన్నో ఛేదించారని, విధుల్లో ముక్కుసూటి గాఉంటారని, మంచి మనసుతో క్రింది స్థాయి తన సిబ్బంది అభిమానాన్ని పొందారని అన్నారు. గంగరాజు గారు మాట్లాడు తూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు, ఇక్కడ సిబ్బంది ఎంతో సౌమ్యులని, కష్టపడి పనిచేస్తారని, ఈ జిల్లా వచ్చే ముందు చాలా దూరం బదిలీ అయిందని బాధపడుతూ వచ్చాను కానీ ఈ రోజు వెళ్లేందుకు బాధపడుతున్నా అని బావుద్వేగంతో అన్నారు G.గంగరాజు గారు 1984 సం లో RSI  గాను చేస్తూ, గ్రూప్ ll లో ఎంపికై  1985 లో సివిల్  ఎస్.ఐ గా  చేస్తూ Ci, DSP, అదనపు ఎస్పీ గా పదోన్నతి ని పొందినారు. డిఎస్పీ టి.పాల్గుణరావు గారు 1989 లో ఎస్. ఐ  గా పోలీస్ శాఖ లో చేరి డిస్పీ గాను, పి. రాజేశ్వరరావు గారు 1986 లో  జూనియర్ అసిస్టెంట్ గా పోలీస్ శాఖ లో చేరి Offce Supdt., గాను, G.నాగరాజు  1979 లో AR కానిస్టేబుల్ గా చేరి RSI గాను, ఆర్ సి హెచ్ ప్రధాని గారు 1984 లో కానిస్టేబుల్ గా చేరి హెడ్ కానిస్టేబుల్ గాను పదోన్నతిలు పొంది ఈ రోజు ఆరోగ్యం గా పదవీ విరమణ పొందడం ఎంతో అదృష్టవంతులుగా భావించాలని ఎస్పీ అన్నారు. * ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ కె. శ్రీనివాసరావు గారు, డిఎస్పీ DSRVSN మూర్తి, రారాజు ప్రసాద్, సత్యనారాయణ, శివరామ రెడ్డి, Ch.G.V.ప్రసాద్, శ్రీనివాసరావు, శ్రీలత,పరిపాలన అధికారి ప్రసాద్ గారు, కార్యాలయ సిబ్బంది,  సి.ఐ లు, ఆర్. ఐ  లు, కుటుంబ సభ్యులు, అధికారుల సంఘం ప్రెసిడెంట్ కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Featured

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఎం.పి. చింతా. అనూరాధ అమలాపురం, మే 31,2020 (పున్నమి విలేఖరి) రక్త హీనత లేకుండా గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఈ రోజుకు సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలో పి.గన్నవరం శాసన సభ్యులు కొండేటి చిట్టిబాబు తో కలిసి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఎం.పి. చింతా.అనురాధ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరం ఏ.ఎం.సి. చైర్మెన్ కొమ్ముల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

‘తోటపల్లి’ సైఫూన్ బీటల పరిశీలన

పాలకొండ : మండలంలోని మల్లివీడు వద్ద గల తోటపల్లి ప్రధాన కాలువ సైఫూన్ కు పడిన బీటలను తోటపల్లి సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఖరీఫ్ కు సాగు నీరు కష్టమేనని పేర్కొన్నారు.  వెంటనే మరమ్మతులు చేపట్టాలని,  లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

Featured

వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం

వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం పలమనేరు మే31,2020(పున్నమి విలేకరి ): పలమనేరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని తిరు వెంకట నగరిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నందు జ్యేష్టాభిషేక పూజలను అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధన్వంతరియాగము ,సుదర్శన్ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి చేసి మంగళ హారతులతో స్వామి వారి యాగాన్ని పరిసమాప్తం చేశారు. పవిత్ర కలశాల్లోని జలాలను శ్రీచక్ర ఆళ్వార్లకు నాగదేవతలకు కుంభ అభిషేకాన్ని నిర్వహించి పూజలను ఘనంగా జరిపారు. సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలతో ఆలయ అర్చకులురంగనాథ ఆచార్యులు ధర్మకర్తల కమిటీ కొద్దిమందితో మాత్రమే పూజా కైంకర్యాలను నిర్వహించారు అనంతరం రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూని పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిటిడి వారి సహాయ సహకారానికి గ్రామస్తులు తరఫున ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు