Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

ప్రకాశం

నిబంధనలు తప్పనిసరి – మున్సిపల్ అధికారి ఆవుల సుధాకర్

దర్శి, జూన్ 5, 2020(పున్నమి విలేఖరి): దర్శి మున్సిపాలిటీ పరిధిలో వ్యాపార సంస్థలు, కొనుగోలు, అమ్మకం దారులు కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శుక్రవారం మున్సిపల్ అధికారి ఆవుల సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల వద్ద ఐదు మంది కంటే ఎక్కువగా ఉండరాదని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానీటైజర్ లు వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు. మాస్క్ ధరించని వారికి 50 రూపాయల జరిమానా, వ్యాపార సంస్థల వారు నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే 500 రూపాయలు జరిమానా తదితర అంశాలను మున్సిపల్ కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించుచున్నట్లు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కలెక్టర్ కు వినతి.

శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కారానికై జూన్ 15న మహరాయభారం జయప్రదం చేయాలని కార్మిక,కర్షక,ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయుకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక,ఉద్యోగ, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో  కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లే కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె.నివాస్ గారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయుకులు మాట్లాడుతూ పొందూరు వద్ద గల  శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ యాజమాన్యం గత 10 సంవత్సరాలు నుండి కనీస వేతనాలు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ గుర్తింపు కార్డులు, విడిఎ, చట్టబద్దమైన సెలవులు వంటి చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయడం లేదని తెలిపారు. అమలు చేయాలని కోరితే పరిశ్రమలో పనిచేస్తున్న 8మంది కార్మికులను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా శ్రీ రాజ్యలక్ష్మి పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా ఉద్యోగాలు నుండి తొలగించిందని అన్నారు. చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని అడుగుతున్నారని యాజమాన్యం ఏకపక్షంగా ఎటువంటి తప్పు లేకపోయినా కక్ష పూరితంగా తొలగించింది. ఇలా తొలగించడం  చట్ట వ్యతిరేక చర్య అని అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం ఏ ఒక్క కార్మికుడిని తొలగించరాదని ఆదేశాలు ఇచ్చినప్పటికీ శ్రీ రాజ్యలక్ష్మి పి.ఎస్.సి.సి యాజమాన్యం కార్మికులను అన్యాయంగా, ఏకపక్షంగా తొలగించడం కార్మిక చట్టాలకు విరుద్దమైన చర్య అని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని, శ్రీ రాజ్యలక్ష్మి పరిశ్రమలో పనిచేస్తున్న కొంతమందికి లాక్ డౌన్ కాలానికి యాజమాన్యం వేతనాలు చెల్లించి కొంతమందికి చెల్లించలేదని ఇది చట్టవ్యతిరేక చర్య అని అన్నారు. యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు తలపడుతున్నదని యూనియన్ ను లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ యూనియన్ నాయకులను ఉద్యోగాలను నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. యాజమాన్యం కార్మికులపై వేధింపులు కక్షసాధింపు చర్యలు చేస్తుందని అన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీసుకు పాల్పడుతుందని అన్నారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయలు లాభాలు అర్జించిన రాజ్యలక్ష్మి యాజమాన్యం నేడు కార్మికులను రోడ్డు పాలు చేసి ప్రభుత్వ అండతో కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించకుండా మద్యం, డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి పారిశ్రామిక అశాంతి సృష్టిస్తుందని విమర్శించారు. చట్టాలన్నింటిని ధిక్కరించి కార్మికులపై పగ సాధిస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి యాజమాన్యం దుశ్చర్యలను అన్ని కార్మిక, ప్రజా సంఘాల నాయుకులు ఖండించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు. కార్మికశాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ సమావేశాలకు హజరుకాకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సమస్యలు పరిష్కారానికి హక్కుల సాధనకు శ్రీ రాజ్యలక్ష్మి పవర్ ఇన్ ఫ్రా వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు అన్ని కార్మిక,ప్రజా సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. తక్షణం ప్రభుత్వం యంత్రాంగం జోక్యం చేసుకొని  కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి పి.ఎస్.సి.సి యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించేలా, కనీస వేతనాలు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ మొదలగు చట్టపర సౌకర్యాలు అమలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని జూన్15న  యాజమాన్యానికి మహరాయభారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం,  మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు.మహాలక్ష్మి, యుటిఎఫ్ జిల్లా కోశాధికారి పొందూరు అప్పారావు, జిల్లా కార్యదర్శి ఎండ ఉమాశంకర్ స్మార్ట్ కెమ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.జగ్గారావు, శ్యాంపిస్టన్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గొర్లె.కిరణ్, శ్యామ్ సుందర్,కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి. ప్రసాదురావు, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీ, వి.ఆర్.ఎ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు. సత్యనారాయణ, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  డి.పార్

ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించండి – గౌతమ్ రెడ్డిని కలిసిన యువనేత. డా. ధర్మాన కృష్ణ చైతన్య

నరసన్నపేట, జూన్ 5:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకతపై మంత్రితో చర్చించారు. ఏళ్ల తరబడి వలసలు పోతున్న వారికి చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా కారణంగా  చాలా మంది వెనక్కి వస్తున్నారని, వారికి ఉపాధి కరువై ఆందోళనలో ఉన్నారని చెప్పారు. దీనికి పర్యావరణ హితమైన  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ఒక్కటే మార్గమని చెప్పారు. జిల్లాలోనూ ప్రత్యేకించి నరసన్నపేట నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, భూమి, నీటి లభ్యతకు ఇబ్బంది లేదని ప్రధాన జాతీయ రహదారి,  రైల్వే మార్గం ఉండటం కలిసి వచ్చే అంశాలు అని చెప్పారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ ( సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ) ల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూపొందించిన ‘వైఎస్ఆర్ నవోదయం’ పథకం ఎంతో మేలు చేసిందని కృష్ణ చైతన్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

*ఏనుగు కేసులో పురోగతి:కేరళ సీఎం*

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ కేరళలో ఏనుగు మృతి ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది.దీనికి బాద్యులుగా భవిస్తూ ముగ్గురు అనుమనితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకొంది.వారిని విచారిస్తున్నామని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ CM పినరయి విజయన్ తెలిపారు. పోలీస్ శాఖ అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం

చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గం లోని తవణంపల్లి మండలం ఎగువ మత్యం గ్రామంలోని నవీన్ కుమార్ రెడ్డి కుమారుడు హావిష్ రెడ్డి( 5) వైద్యం కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేస్తున్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు,

Featured

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపుతానని బెదిరిస్తున్నాడు.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని కాగులపాడు గ్రామంలోని జె.అనిత అనే ఒక వివాహిత తన భర్త సుకుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒకే గ్రామానికి చెందిన సుకుమార్ అనితకు 2013లో ఒకరికొకరు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సుకుమార్ తల్లిదండ్రులు ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. ఈ నేపధ్యంలో అనిత వాళ్ళ ఇంటికి వెళ్లారు. కానీ వెళ్లిన రోజు నుండి సుకుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తమను ఐదు లక్షలు కట్నం తీసుకురమ్మని తరచూ వేధించేవాడని బాదితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఇరువురు పోలీసు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ కేసులు కోర్టులో నడుస్తూ ఉన్న నేపథ్యంలో సుకుమార్ మళ్లీ తన దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం నీ దగ్గర ఉండడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదని అన్నాడని, అప్పటి నుండి మాఇంటికి వచ్చి వెళ్ళేవాడని బాధితురాలు చెప్పడం జరిగింది. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు బాధితురాలు గర్భవతి కావడంతో సుకుమార్ నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడని, అంతేకాకుండా నన్ను నా కడుపులోని బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడు అని బాధితురాలు వాపోతుంది. సుకుమార్ తనకు రాజకీయ పలుకుబడి ఉండడంతో నన్ను చంపుతాడని భయంగా ఉంది. కాబట్టి పోలీసు వారు నాకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నానని బాధితురాలు అన్నారు.

Featured

మీ – సేవలు ఇకపై సచివాలయంలోనే అందుబాటులో ఉంటాయి.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి- జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెంలోని సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నరసింహారావు, త‌హ‌సీల్దార్‌ షఫీ మాలిక్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలపై వారికి అవగాహన కల్పించారు. గతములో మీ -సేవ ద్వారా అందించే అన్ని రకాల సేవలను ఇకపై సచివాలయంలోనే ప్రజలకు అందించనున్నామని ఎంపీడీవో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ఆన్ లైన్‌ సేవలను అందించడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కళ్యాణి, ఈవోపీఆర్డీ పెంచల శ్యామ్ పాల్గొన్నారు.

Featured

బుచ్చిరెడ్డిపాలెం లోని ఇస్కపాలెం గ్రామ పంచాయతీలో వై ఎస్ ఆర్ హౌసింగ్ స్కీమ్ ధరకాస్తుదారురుల వెరిఫికేషన్.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామపంచాయతీ బిట్ 1 లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ 2020 ద్వారా రెండో విడత దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు వివరాల వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం తమ సొంత ఇల్లు నిర్మించలేని రాష్ట్రంలోని పేద ప్రజలకు గృహాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జూలై 12, 2019 న వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ 2020 ను ప్రారంభించారు. ఈ పథకం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రధాన 9 వాగ్దానాల్లో ఒకటి. ఈ పథకానికి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టారు. ఈ పథకాన్ని అంతకు ముందు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం గా వ్యవహరించేవారు.YSR హౌసింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక బలహీన విభాగం వర్గం పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వ చొరవ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని లబ్ధిదారులకు పక్కా గృహాన్ని అందించబోతోంది, దీని కోసం రాష్ట్ర బడ్జెట్ కింద రూ.1280 కోట్లు కేటాయించారు.ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి రాష్ట్ర బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఈ గృహ పథకం ముఖ్యంగా రాష్ట్రంలోని EWS/MIG/LIG వర్గం ప్రజలకు. ఈ కార్యక్రమంలో ఇస్కపాలెం బిట్ 1 వి ఆర్ ఓ శ్రీనివాసులురెడ్డి, వి ఆర్ ఏ లు రమణయ్య, యాదగిరి, ఆ ఏరియా వాలేంటర్ బబ్లూ పాల్గొన్నారు.

Featured

నాడు-నేడు పనులు సకాలం లో పూర్తి చేయాలి

04-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు పథకంలో భాగంగా మొదటి ఫేస్ లో జరుగుతున్న పనులను డిప్యూటీ డి.ఈ రాధాకృష్ణ పరిశీలించారు .ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలం లో నాడు-నేడు ఫస్ట్ ఫేస్ కి సంబంధించి 20 స్కూల్స్ ని ఎంపిక చేయడం జరిగిందని వీటి పనులకు సంబంధించి నాలుగు కోట్ల నలబై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల తొంబై ఒక్క రూపాయలు మంజూరు అయినవి అని తెలిపారు . మొత్తంపదహారు స్కూల్ లలో ప్రహరీ గోడనిర్మించవలసివున్నదని తెలిపారు .మొత్తం తొమ్మిది రకాలపనులుచేయవలసిఉందన్నారు .పెయింటింగ్ ,ఎలక్ట్రికల్ ,ప్లంబింగ్ ,శానిటేషన్,మేజర్ అండ్ మైనర్ వర్క్ , మినరల్ వాటర్ స్కూల్ కి అవసరమైన టేబుల్స్ మొదలైనవన్నీ జూలై 31 కి పూర్తి చేయవలసిందిగా ఆదేశించామన్నారు ఆగస్టు మూడు కి స్కూల్స్ ప్రారంభించే టప్పటికీ అన్ని వసతులతోతీర్చిదిద్దుతామని తెలియజేశారు .మనుబోలు లోని చంద్రమౌళినగర్ నందు మరియు బద్దవోలు, వెంకన్నపాలెం నందు గల స్కూల్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,నాడు నేడు మనుబోలు ఏ.ఇ సుబ్బరాయలు, జడ్పీ బాయ్స్ హెడ్ మాస్టర్ ఎం.రమేష్ కుమార్ ,జడ్పీ గర్ల్స్ హెడ్మాస్టర్ జె.పద్మజ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* 

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* ఆంద్రప్రదేశ్ లో నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది.ఈ పధకం ద్వారా *2,62,493* మందికి *262,49కోట్లు* ఆర్థిక సాయం అందనుంది.   స్వంత వాహనం కలిగిన.ఆటో. టాక్సీ.మ్యాక్సీ క్యాబ్. డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లోఈ రోజు జమ కానుంది   గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా. *37,756* మంది లబ్ధిదారులజాబితాలోచేరారు. కాగా ఈపధకం కింద ప్రతి ఏటా రూ. పది వేలుఇవ్వనున్నారు.