తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలి.. ఒంగోలు మహాధర్నాను విజయవంతం చేయాలి
లింగసముద్రం: తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఒంగోలులో నిర్వహించనున్న మహాధర్నా కరపత్రాలను శుక్రవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ఆవిష్కరించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు లింగసముద్రం, పెద్దవాని మసీదులతో పాటు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తౌషిక్ మరణంపై సీబీఐ విచారణ చేపట్టి, బాధ్యులను అరెస్ట్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మహాధర్నాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పందిటి అంబేద్కర్ మాదిగ, గౌడుపేరు కాంతారావు మాదిగతో పాటు పలువురు నాయకులు, ముస్లిం పెద్దలు, యువకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
