Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

చిత్తూరు

చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ వికటించి పురిటిబిడ్డ మృతి …. .

CHITTOR:ఆపరేషన్ వికటించి పురిటి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు . ఇందుకు బాధ్యులైన ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ ఘటన మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది . చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో పురిటిబిడ్డ చనిపోయింది . పుంగనూరు వాండ్లపల్లికి చెందిన ముబారక్ బేగం ( 23 ) పురిటి నొప్పులతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం చేరింది . సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది . అయితే అంత సమయం లేకపోవడం వల్ల సాధారణ కాన్పు చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు . అనంతరం కొద్దిసేపటికే మగ బిడ్డకు బేగం జన్మనిచ్చింది . అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయి ఉండటం , పురిటి బిడ్డకు గాయాలు ఉండటాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు గమనించారు . ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా పురిటి బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపించారు . ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు

ప్రకాశం

దళితులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి: దళిత ప్రజాసంఘాలు

దర్శి, జూన్ 8, 2020 (పున్నమి విలేఖరి): దర్శి పట్టణంలో సోమవారం స్థానిక ఏపీటీఎఫ్ ఆఫీసు లో రాష్ట్రదళితసేన దరిశి నియోజకవర్గ కమిటీ అద్వర్యం కె.మార్కు అద్యక్షతన “దళితులపై దాడులు – ప్రభుత్వంవైఖరి” అనే ఆంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర దళితసేన దరిశి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దళితులు, దళిత అధికారులు పై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుపై దాడులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతక్షణమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించాలని దళిత అధికారుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని, దళిత అధికారుల పై దౌర్జన్యం, దాడి చేసిన ముద్దాయిను ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటియాక్టు కింద అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిసి సంఘాల రాష్ట్ర నాయకులు అన్నవరపు వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈపాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఇంకా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్ని మాట్లాడారు. ఈకార్యక్రమంలో కె.మార్కు, ఆగ్రో టైం స్కెల్ వర్క్స్ &ఎంఫ్లాయిస్ యూనిట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, ఎరుకులసంక్షేమ సంఘంనాయకులు వెంకటేశ్వరరావు, ఎస్సీ నాయకులు జీ. పెద్ద వెంకటస్వామి, ఏపీటీఎఫ్ దరిశి మండల ప్రధాన కార్యదర్శి యన్.జాన్, పాస్టర్ సంఘం నాయకులు ఇత్తడి ఏసుపాదం‌‌, రాచపూడి ఆహరోన్ తదితరులు పాల్గొన్నారు.

Featured

గరీబ్ బిరియాని సెంటర్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు ✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నెల్లూరులోని గరీబ్ బిర్యానీ సెంటర్ పై ఆదివారం పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. గరీబ్ బిర్యానీ సెంటర్ యాజమాన్యానికి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ దాడులలో పాల్గొన్న పుడ్ సేఫ్టీ అధికారి వెంకరమణ మాట్లాడుతూ..నగరంలో మున్నిపల్ కార్పొరేషన్ ఇచ్చిన అనుమతులను పాటిస్తూ విక్రయాలను కొనసాగించాన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని విక్రయాలు కొనసాగిస్తే లక్ష రూపాయలు జారిమానా విధిస్తామన్నారు.

Featured

నెల్లూరు జిల్లాలో 339కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు ✍️

    పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతూనే ఉంది.తాజాగా మరో 22 కేసులు నమోదయ్యాయి.నిన్నటికి 317 పాజిటివ్ కేసులుగా ఉండగా వాటి సంఖ్య 339కి చేరుకుంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు కరోనాతో నెల్లూరు జిల్లాలో ఐదు మృతి చెందారు.

Featured

రాపూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ట్రైనీ డిఎస్పి షేక్ .షాను

రాపూరు, జూన్ 06, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడురు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రాపూరు పోలీస్ స్టేషన్ ను ట్రైనీ డి.యస్.పి షేక్. షాను ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఎర్రచందనం సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి పెడింగ్ లో ఉన్న కేసులగురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం యస్.ఐ. స్వప్న ను రాపూరు కు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకొనిన అనంతరం గ్రామ పోలీసులను వారి యొక్క గ్రామాలలో స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు తదుపరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎవరైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పంగిలి చక్ పోస్టును,అటవీ ప్రాంతంను పరిశీలించారు విరివెంట రాపూరు ఎస్ఐ. కోటిరెడ్డి, ఎస్ఐ.స్వప్న,ఏ ఎస్ఐ బ్రహ్మానంద రావు మరియు సిబ్బంది ఉన్నారు.

Featured

కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాపూరు పోలీస్ స్టేషన్ కు శానిటైజర్,మాస్కులు పంపిణీ

రాపూరు, జూన్ 06, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణము లో వెంకటగిరి కి చెందిన కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాపూరు పోలీస్ స్టేషన్ కు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు ట్రైనింగ్ డిఎస్పి షేక్ .షాను చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ లోని సిబంధికి అందించారు ఈ కార్యక్రమంలో కవచ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండు. మనోజ్ కుమార్ మాట్లాడుతూ కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోని పేదలకు,చెల్లా యనాధులకు కరోనా కష్ట కాలంలో నిత్యావసర వస్తువుల, మస్కలు,శానిటైజర్ పంపిణీ చేశాము మరియు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు డక్కలి, సైదాపురం, బాలాయపల్లి,రాపూరు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేస్తున్నము ఇలాగే ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తలియజేశారు ట్రస్ట్ సభ్యులు జల్లి. జోతిర్ మయ, విజయ్,రాజేష్ పాల్గొన్నారు.

Featured

దుగరాజపట్నం ( ఆర్మోగాన్ ) వెలుగు నీడలు

నా చిన్నప్పటినుండి వింటున్నాను! నెల్లూరుజిల్లాలోని దుగరాజపట్నాన్ని” పేద్ద ఓడ రేవుగా ” అభివృద్ధి చేస్తారని. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాయకులు తమకు అలవాటైన రీతిలో చేసే సొల్లు ప్రసంగాలకు దుగరాజపట్నం నెలవుగా ఉండటం తప్ప రాజకీయ నాయకులు చేస్తామన్న అభివృద్ధి జరిగింది లేదు సచ్చింది లేదు. అయిన కొత్తగా అభివృద్ధి ఇప్పుడు చేయడం ఏందీ ఎప్పుడో 2000 సంవత్సరాల కితమే దుగరాజపట్నం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉండింది. శాతవాహన కాలానికే వెలసివున్న దుగరాజపట్నం, తూర్పుతీరంలో ఎగుమతులు, దిగుమతులకు ప్రధాన రేవు పట్టణంగా ఉంటూ, మొన్నటి ఆంగ్లేయుల విస్తరణకు సైతం కేంద్ర బిందువైంది. ప్రధానంగా నీలిమందు, ఉప్పు, చక్కర, క్యాలికో గుడ్డలు, తదితర వస్తువులతో నిరంతర వాణిజ్యం జరిగేది. ఇక్కడి దొరికే కలంకారీ వస్త్రం భారతదేశంలోనే మన్నికైనదని, చౌకైనదని మేథోల్డ్ రాసాడు. గుడ్డ వెలిసిపోకుండా ఉంటూ, దాని మనోహరమైన అద్దకం గుడ్డ చినిగిన, రంగు అలాగే ఉండేదని, రాజులు ఇక్కడ దొరికే వస్త్రాలపై ఏంతో మక్కువ కలిగి ఉండేవారని పేర్కొన్నాడు. ఆంటోని స్కోరర్, డచ్ అజ్ఞాత వర్తకుడు లాంటి వారు తూర్పు కోస్తా లోని వ్యాపారాన్ని, సంఘాల్ని గురించి తమ అనుభవాలను రాశారు. శాతవాహన, ఇక్షాకుల కాలంలో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లినదనడానికి ఇక్కడ దొరికిన వస్తుసామాగ్రే దానికి సాక్ష్యం. రొయ్యల గుంతలకోసం తవ్వుతున్నప్పుడు శాతవాహనాకాలం నాటి ఇటుకలు, మృణ్మయ పాత్రలు, నాణేలు విరివిగా దొరికాయి. రేనాటి చోళుల కాలంలో క్రీ.శ . 6-7 వ శతాబ్దకాలంలో ప్రముఖ రేవు పట్టణంగా వర్ధిల్లిందని కార్తికేయ శర్మ ధృవీకరించారు. ఆ తర్వాత అడపాదడపా స్పానిష్, అరబ్బుల రాతల్లో మాత్రమే మెరిసి, చరిత్రకారుల దృష్టి ఈ రేవు పట్టణంపై పడకపోవడంవల్ల ఇది సముద్రపు చీకటి లోతుల్లో ఉండిపోయింది. తిరిగి ఎప్పటికో బ్రిటీషువారు ఈ గడ్డపై అడుగుపెట్టి కొండూరుపాళెం నుంచి ఓడపాలెం దాకా ఉన్నటువంటి దుగరాజపట్నం రేవు తమ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని తలచడంతో మరల ఇది వెలుగులోకి వచ్చింది. ఆంగ్లేయులు భారతదేశంలోని తూర్పుతీరంలో వున్నమచిలీపట్నంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ కట్టినప్పటికీ అప్పుడది గోల్కొండ పాలన కింద ఉండి పెద్దగా కలసిరాలేదు. ముఖ్యంగా డచ్చి వారితో పోటీ, ఫోర్చుగీసు వారితో కలహాలు, మచిలీపట్టణం గవర్నరు విముఖత ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండలేని ఆంగ్లేయులు అక్కడి ఫ్యాక్టరీని మూసేసి దక్షిణాదికి వచ్చి కొంతకాలం 1621 లో డచ్చి వారితో పులికాట్లో కలిసి వ్యాపారాన్ని చేస్తారు. అక్కడ డచ్చివారితో ఉండలేక 1626 లో దుగరాజపట్నానికి వస్తారు. అక్కడ కొంత స్ధలాన్ని సేకరించి చిన్న ఫాక్టరీ, ఒక బురుజు నిర్మించుకొంటారు. దీనికి సంభందించి నెల్లూరు మాన్యువల్ లో ఇలా ఉంది. 1625 లో ఇంగ్లీషువారు కోరమాండల్ తీర ప్రాంతంతో వ్యాపార సంభందాలు ఏర్పరచుకోవాలనే భావనతో బటావియా నుండి ఒక ఓడను పంపించారు. అది సరాసరి మన దుగరాజపట్నం రేవుకు వచ్చి చేరింది. అప్పుడు ఆ గ్రామ కారణంగా ఉండిన పట్నస్వాముల ఆర్ముగం మొదలియార్ సహకారంతో ఇంగీషువారు అక్కడ కాలు పెట్టారు. దక్షిణ తీర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తమ స్థావరం ఏర్పాటుచేసుకొనే అవకాశం ఆర్ముగం మొదలియార్ కల్గించాడు. అందుకు కృతజ్ఞతగా ఆ ప్రాంతానికి ఆర్మగాన్ అని నామకరణం చేశారు. బాస్వేల్ మాన్యువల్ రచనకు ముందే స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ఏమిటంటే, కంపెనీ వారి కూడా దుగరాజపట్నం రేవు చేరినపుడు ఆ ప్రాంతాన్ని రాజగోపాలనాయుడు ముత్తాత గురవనాయుడు పెద్దగాను, ఆర్ముగం మొదలియార్ గ్రామకరణంగాను ఉండేవారు. ఓడలో వచ్చిన కంపెనీ అధికారులు గురవనాయుడు, ఆర్ముగం మొదలియార్లను పిలిపించి తాము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదలచామని, ఒక కోటను నిర్మించదలచామని చెబుతారు. ఆశతో ఇద్దరు పెద్దలు వెంటనే అంగీకరించడంతో ఆంగ్లేయులు ఎట్టకేలకు దుగరాజపట్నంలో పాగా వేస్తారు. అందుకు కృతజ్ఞతగా ఆప్రాంతాన్ని ఆర్మోగాన్ గా నామకరణం చేసి ఆ తర్వాత కొంతకాలానికి దుగరాజపట్నానికి తూర్పుదిశగా కంపెనీవారు కోట బురుజు నిర్మించారు. వాస్తవానికి ఆర్ముగాన్, దుగరాజపట్నం వేర్వేరు ప్రాంతాలు ఆంగ్లేయులు రాకముందే ఆర్మగాన్ రేవుపట్టణం ఉంది. దుగరాజపట్నానికి ఆర్మోగాన్ అనుబంధ గ్రామంగా ఉండింది. ఈ తేడాను పట్టించుకోకుండా ఆంగ్లేయులు రెండింటిని కలిపి ఆర్మోగాన్ గా వ్యవహరించారు. కొంత ద్రవ్యము సంపాదించిన ఆంగ్లేయులు ఒక అడుగు ముందు వేసి తాము నిర్మించిన బురుజు మీదనుంచి తుపాకీ పేల్చితే అది పడమటి దిశగా ఎంతదూరంలోవెళ్లి పడితే ఆమేరకు స్థలం, తమకు స్వాధీనం చేస్తే పెద్ద కోట నిర్మిస్తామని కంపెనీ అధికారులు చెప్పారు. ఆ ప్రాంతమంతా వెంకటగిరి రాజు బంగారు యాచమానాయుడిది కనుక అంతనితో సంప్రదించి అనుమతి తీసుకొనేందుకు గురవనాయుడు, ఆర్ముగం మొదలియార్ లు ప్రయత్నం చేయగా బంగారు యాచమ నాయకుడు అనుమతి ఇవ్వలేదు. దీంతో వీరు కాళహస్తి జమిందారికి చెందిన దామెర్ల చెన్నప్పనాయుడుతో మాట్లాడి, మైలాపూరుకు ఉత్తరంగా ఉన్న చెన్నకుప్పం అనే ప్రదేశాన్ని కంపెనీవారికి దారాదత్తం చేశారు. ఇప్పుడు చెప్పబడిన కథలో కొన్ని అవాస్తవాలున్నాయి. అప్పటి కాలానికి చరిత్రలో, వెలుగోటివారి వంశావళిలో ప్రస్తావించని గొప్ప రాజు వెలుగోటి వెంకటాద్రినాయుడు జమానా నడుస్తుంది. ఈయన రాపూరు రాజధానిగా చేసుకొని ముప్ఫైయ్యేళ్ళు పాలించిన చరిత్రలో ఎక్కడ కనపడడు. బటర్ వర్త్ శాసనాల సంపుటిలో మాత్రం వెంకటాద్రినాయుడిని గురించి కన్పిస్తుంది. ఎందుకనో నెల్లూరు మాన్యువల్లో ఈయన గురించి ప్రస్తావించబడలేదు. ఆనాటి రాజు బంగారు యాచమానాయకుడు కాదు, కాని పొరపాటున బంగారు యాచమానాయకుడికి ఆర్మోగాన్ రేవు కథను అంటగట్టారు. అలాగే మద్రాసులో కొంత భాగాన్ని ఆంగ్లేయుల పరం చేసినవాడు కాళహస్తి జమీందారు దామెర్ల వెంకటాద్రి నాయుడే. నెల్లూరు మాన్యువల్ లో చెప్పినట్టు చెన్నప్పకాదు. ఇవన్నీ పక్కనపెడితే ఈస్టిండియా కంపెనీకి దక్షిణాదిన మొట్టమొదటగా ఆశ్రయమిచ్చిన ఘనత దుగరాజపట్నానికే దక్కింది. ఆంగ్లేయుల అవసరాలకు సరిగ్గా సరిపోయింది ఈ రేవు.” the only place on the coromandel coast which affords any real protection to ships during an easterly gale. during the north-east monsoon the sea breaks very high on the shallow ridge of the shoal rendering the harbour within comparatively smooth”. ఇక్కడవరకు కథ బానే ఉంది. కొంతకాలానికి ఆంగ్లేయులకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. రేవు సౌకర్యంగా ఉండకపోవడం, వ్యాపారకేంద్రంగా ఎదగడానికి సంపన్నప్రాంతం కాకపోవడం, ఎగుమతులకు సరిపడా క్యాలికో గుడ్డలను ఈ ప్రాంతవాసులు అందించకలేక పోవడం, ముఖ్యంగా వెంకటగిరి రాజు వ్యతిరేక వైఖరి లాంటి కారణాలతో ఆర్ముగాన్ అభివృద్ధి కుంటుపడింది. కంపెనీవారు మధ్యవర్తుల ద్వారా స్థానిక నేతగాళ్లకు ముందుగా డబ్బులు ఇచ్చి నూలుగుడ్డలు కొనేవారు. ఇలా అడ్వాన్స్ డబ్బులు డబ్బులివ్వడానికి ఆంగ్లేయుల దగ్గర తగినంత డబ్బులు ఉండేవికావు. పై అధికారులు తగినంత పైకం పంపించేవారు కాదు. ఈ పరిస్థితుల్లో మచిలీపట్టణం, దుగరాజపట్నం రేవులలోని ఫ్యాక్టరీలను మూసివేసి, దక్షిణంగా కిందకు వెళ్లాలనుకొన్నారు. పైగా దుగరాజపట్నం బురుజు క్రమేణా శిథిలావస్థకు చేరుకోవడం, దాని మరమ్మతుకు మచిలీపట్టణం ఏజెంటు డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ప్రాంతాన్ని వదిలి పెట్టసాగారు. 1638 లో కంపెనీ డైరెక్టర్లు ఆర్మగాన్ ఫ్యాక్టరీని రద్దు చేయవలసినదిగా పోర్టు అధికారికి ఫ్రాన్సిస్ డే కి ఉత్తర్వులు పంపారు. ఈ ఉత్తర్వులు అమలుచేయకుండా డే దుగరాజపట్నం కంటే మంచి ప్రదేశము ఏమైనా ఉందా అని శోధించి పాండిచ్చేరికి వెళ్తాడు. అక్కడి అధికారులు వ్యతిరేకిస్తారు. ఈ వార్త కాళహస్తి జమిందారికి చెందిన దామెర్ల వెంకటప్ప ( వెంకటాద్రి)కి తెలుస్తుంది. వెంకటప్ప, అతని సోదరుడు అయ్యప్పలు కంపెనీ వారికి, ఇప్పుడున్న సెయింట్ జార్జి ఫోర్ట్ ప్రాంతాన్ని దారాదత్తం చేస్తారు. ఇది 1639 జులై 22 తేదీన, (1639 ఆగస్టు 22 న) ఆంగ్లేయులకు అప్పగించబడింది. దీంతో ఆంగ్లేయులు 1640 ఫిబ్రవరి 20 వ తేదికి దుగరాజపట్నం నుంచి పూర్తిగా బిచాణా ఎత్తివేశారు. దీని కోసం డే తన ఉన్నతాధికారులతో పొట్లాడం, దామెర్ల వెంకటప్పకు పర్షియన్ గుర్రాలు లంచంగా ఇచ్చి అతన్ని వలలో వేసుకోవడం, డే తన దుర్మార్గపు చేష్టలతో స్థానికులను హింసించడం, తర్వాత అంతుచిక్కకుండా చనిపోవడం లాంటి సంఘటనలు చరిత్రలో లిఖించబడ్డాయి. ఇక మళ్ళీ మొదటికి వస్తే దుగరాజపట్నం అనుబంధంగా ఉన్న ఆర్మోగాన్ గ్రామంలో ఓడలు రాకపోకలకు, లంగరు వేయడానికి ఒక దీప స్థంభం కట్టించుకొన్నారు. భారీ నౌక శ్రయ నిర్మాణానికి 1821 లో బ్లాక్ వుడ్ సర్వే పేరుతో పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించారు. పాత దీప స్తంభము తొలగించిన తర్వాత 1853 తిరిగి కట్టబడి ఆర్మోగాన్ లైట్ హౌస్ గా చరిత్రలో నిలిచిపోయింది. దుగరాజపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకొన్న కొద్దిరోజులకే లైట్ హౌస్ నిర్మించబడి ఆనాటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. (ఇప్పుడున్న లైట్ హౌస్ కాదు ). ఈ లైట్ హౌస్ ఉన్న ప్రాంతానికి ఓడపాళెం , మన పాళెంగా నేడు స్థానికులు పిలుస్తారు. ఈ లైట్ హౌస్ గురించి బాస్వేల్ మాన్యువల్, నెల్లూరు జిల్లా గెజిటీర్, ఇతర చరిత్ర ఆధారాల్లో పేర్కొనబడి ఉంది. 1853 లో నిర్మించబడ్డ లైట్ హౌస్ 137 మెట్లతో కట్టబడి గాలి, వెలుతురు వచ్చేవిధంగా పైన పెద్ద దీపం ఏర్పాటు చేయబడింది. పైనుంచి దాదాపు 15 మైళ్ల దూరం వరకు ఓడలు కనిపించేవి. ఇక్కడనుంచి మొట్టమొదటగా టెలిఫోన్ లైనుని సైతం గూడూరు దాకా వేశారు. ఇలా ఓడలకు తమ గమనాన్ని నిర్దేశించిన లైట్ హౌస్ 1923 లో మలేరియా వ్యాధి వ్యాప్తి చెంది ఉద్యోగులు మరణాలకు గురికావడంతో 1938 లో లైట్ హౌసును పూర్తిగా మూసివేశారు. లైట్ హౌస్ మీదున్న దీపం 1937 ప్రాంతంలో విశాఖపట్నంకు తరలించారని అప్పట్లో దాని ఖరీదు లక్షరూపాయలని చెపుతారు. ఆ తర్వాత 1975 లో పాత లైట్ హౌస్కు తూర్పుగా నిర్మాణం కొనసాగించి ఇప్పుడున్న కొత్త లైట్ హౌస్ 1983 లో ప్రారంభించారు. అంటే ఈ ప్రాంతంలో కట్టబడిన మొత్తం 3 లైట్ హౌసులలో ఆంగ్లేయులు కట్టిన రెండు తొలగించబడ్డాయి. భారత ప్రభుత్వంచే కట్టబడిన లైట్ హౌస్ మాత్రమే ప్రస్తుతం నిలిచి వుంది. ఆంగ్లేయులకాలం నాటి పాత లైట్ హౌసును పూర్తిగా తొలగించి ప్రస్తుతం మంచి నీళ్ల

Featured

యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా డాక్టర్. ఉదయ్ శంకర్ అల్లం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ ఉదయ శంకర్ యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా నియమితులయినారు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధ్యాపకులు అయిన మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉదయ్ శంకర్ గారిని మన జిల్లా అధికారి కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా నియమించారు. అందుకు సంబందించిన ధ్రువపత్రం ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం అందుకున్నారు. రక్త దన శిబిరం, పేదలకు నిత్యావసరాలు అందించడం, విశ్వవిద్యాలయ ప్రాంగణం లో వేల మొక్కలు నాటడం, ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించడం, వలస కూలీలకు ఆహార పొట్లాలు అందించడం వంటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు ఉదయ్ శంకర్ గారు చేసిన పనులలో మెచ్చుతునకలు, అలాగే తన అపారమైన విద్య ను విద్యార్థులకు అందిస్తూ మరియు జిల్లా ఎంత్రాంగానికి వివిధ సందర్భాల లో  యెనలేని  సహాయం అందించడం లో ముందుంటారని నిరూపించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్  విజయ కృష్ణ రెడ్డి గారు ఉదయ శంకర్ గారి కి ఈ పదవి ఒక అరుదయిన గౌరవమని ప్రశంసించారు. ఈ సందర్బంగా ఉపకులపతి ఉదయ శంకర్ ని అభినందిస్తూ ఇప్పటివరకు విశ్వవిద్యాలయానికి అందించిన సేవలు మన జిల్లా వాసులకు ఈ పదవి ద్యారా అందించాలని ఆకాంక్షించారు. ఉదయ శంకర్ గారు ఈ పదవి తనకి రావడం అనేది ఎంతో సంతోషానన్ని ఇచ్చింది అని, మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తనపై నమ్మకం తో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా వాసులకు ఇంకా ఎక్కువ సేవ చేస్తాను అని చెప్పారు.

Featured

కంటోన్మెంట్ జోన్ గా అయినవిల్లి..

తూర్పుగోదావరిజిల్లా : శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం, అయినవిల్లి, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు గైడ్ లైన్స్ అనుసరించి 8 వ తేదీ నుండి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయ ఈ. ఓ తెలిపారు.కానీ తాజాగా అయినవిల్లి మండలంలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అయినవిల్లి కూడా కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించినందున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ది.08-06-2020 తేది నుండి భక్తులు దర్శనములను ఉన్నతాధికార్లు అనుమతి ఉత్తర్వులు వచ్చు వరకు నిలుపుదల చేయడమైనదని, భక్తులకు దర్శనములు తేదీని తదుపరి ప్రకటన ద్వారా తెలియపరచుట జరుగుతుందని , శ్రీ స్వామి వారికి జరుగు సేవలు, దూప, దీప నైవేద్యములు యధాప్రకారము గా ఏకాంతముగా అర్చకులు వారిచే జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు. శ్రీ స్వామి వారికి పూజాది కార్యక్రమాలు జరిపించుకొనుటకు దేవస్థానము వారు ఆన్ లైన్ సేవలు అందుబాటులో (www.svstemple.com) ఉంచామని ఈఓ. తారకేస్వరారావు తెలిపారు.