Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

మేమూ మనుషులమే మమ్మల్ని గుర్తించండి – భవన నిర్మాణ కార్మికులు

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రెసిడెంటు బంకా తిరుపతి రెడ్డి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఆనాటి ప్రభుత్వాలు 1996 సంవత్సరంలో ఒక చట్టాన్ని కూడా రూపొందించారని దానికి 1000 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారని ఆయన తెలిపారు. దీనిని నేటి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు అంటే బేల్దారులు, కొయ్యి పని, కరెంటు పని, పెయింట్ పని, ఇలా ఇరవై మూడు రకాల పనులు చేసుకునేవారు ఈ సంఘం పరిధిలోకి వస్తారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల కార్య సాధనకై ఒక బోర్డులు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నిధులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి కార్మికుడికి 110 రూపాయలను కట్టించుకుని ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగిందని, ఈ గుర్తింపు కార్డు గడువు తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి కూడా సౌకర్యం ఉందని చెప్పారు. ఈ గుర్తింపు కార్డు ఉన్న వారికి కాన్పు కానుక కింద 20 వేల రూపాయలను అలాగే సహజ మరణానికి 80,000, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల నలభై వేలు ఇస్తారని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా బోర్డు నిధుల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదే కాకుండా ఉదాహరణకి 10 లక్షల రూపాయలు భవన నిర్మాణం జరుపుతున్న యజమాని మున్సిపాలిటీ పరిధిలో అయితే చెస్సు రూపంలో లక్ష కి వెయ్యి రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ కు కడుతున్నారని అన్నారు. ఇలా బోర్డు కు వచ్చిన ప్రతి రూపాయి ని భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి నియోగించాలని తెలియజేసారు. భవన నిర్మాణంలో పని చేసే ప్రతి కార్మికుడు ప్రతి క్షణం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నారని అంతేకాకుండా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ కాలం బ్రతకడని శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వాలు చేతి వృత్తి పనులు చేసుకునే ఇతర కులాల వారికి ఏ విధంగా అయితే పథకాలను ప్రవేశపెట్టి లబ్ధి చేకూరుస్తున్నారో అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కూడా గుర్తించాలని అంటున్నారు. జిల్లా మొత్తం మీద 10 ఆఫీసులు ఉండగా ఏ ఆఫీసులోనూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార పనితీరుపై అసంతృప్తికరంగానే ఉందని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు చాలా పర్యాయాలు ఫిర్యాదు చేసి ఉన్నామని అన్నారు. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు మూడు నెలలు లాక్ డౌన్ విధించడంతో అనేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు ఎవరూ పట్టించుకోలేదని తన ఆవేదనను వ్యక్తస్తున్నాడు. రాష్ట్రంలోని మిగతా మంత్రులు లాగా కార్మిక శాఖ మంత్రి కూడా ఉన్నాడా లేడా అని ఆయన ప్రశ్నించాడు. ఒకవేళ ఉంటే మిగతా మంత్రులు లాగే కార్మికుల గురించి స్టేట్మెంట్లు కానీ లేదా ప్రెస్ మీట్ లో గానీ ప్రస్తావించిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికుల ను గుర్తించి వారి యొక్క సమస్యలపై దృష్టి సారించి ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున కోరుకుంటున్నానని అన్నారు.

Featured

జొన్నవాడ కామాక్షమ్మ దర్శనానికి సర్వం సిద్ధం.

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయం లో నేటి నుండి స్వామి అమ్మవార్ల దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రం లోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం ఒకటి. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సుమారు మూడు నెలల పాటు ఆలయం మూత పడటంతో భక్తులు అమ్మవారి దర్శన భాగ్యంకు నోచుకోలేక పోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించి దేవాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో రేపటి నుండి జొన్నవాడ ఆలయంలో భక్తుల దర్శనార్థం మల్లికార్జున స్వామి సమేత అమ్మవార్ల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను ఆలయ సిబ్బంది ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రెండు రోజులు జొన్నవాడ గ్రామస్తులకు దర్శనాలు అనుమతి ఉందని, ట్రైల్ రన్ పూర్తయిన తర్వాత అందరిని అనుమతిస్తామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీని వాసులరెడ్డి తెలిపారు.

Featured

బుచ్చిరెడ్డిపాలెం లోని కనిగిరి రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు జాలరు మృతి.

07-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని కనిగిరి రిజర్వాయర్ నందు జాలరు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కనిగిరి రిజర్వాయర్ నందు చేపల వేటే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో భాగంగానే చంద్రయ్య(45) అనే ప్రకాశం జిల్లా పెద్దగంజాం గ్రామం వాసి వేటకు వెళ్ళాడు. ఇతను సంవత్సరంలో మూడు నెలలు ఇక్కడ చేపలవేట కొనసాగించేవాడు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం రోజు చేపల వేటకు బయలు దేరి ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి మృతిచెందాడు. అటుగా వెళ్ళిన మరొక జాలరి మృతదేహాన్ని చూసి ఒడ్డున ఉండే వారికి సమాచారం అందించగా అందరూ కలసి వెళ్లి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు మృతికి గల కారణాలను ప్రాథమిక అంచనా వేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Featured

బుచ్చిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్లో హైపవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు – ఏడి రమేష్ చంద్ర.

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో హై పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న బుచ్చి పెరుగుతున్న జనాభా దృష్ట్యా విద్యుత్తు వినియోగం ఎక్కువ కావడంతో లో ఓల్టేజ్ సమస్యతో ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎ డి రమేష్ చంద్ర అన్నారు. ఈ నేపథ్యంలో బుచ్చి సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి 5MVA, 3.5MVA, 8MVA ట్రాన్స్ఫార్మర్ల లో 5 MVA ట్రాన్స్ఫార్మర్ తొలగించి దాని స్థానంలో 8MVA ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.బుచ్చిరెడ్డిపాలెం మండలం మొత్తం ఇక్కడినుండే విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో అంతకు ముందు తో పోల్చుకుంటే ప్రస్తుతం విద్యుత్ వినియోగం ఎక్కువయిందని అందువలన లోడ్ సరిపోక లో వోల్టేజ్ కారణాలు వంటివి తలెత్తుతున్నాయని అందువలన హై పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నట్లు రమేష్ చంద్ర వెల్లడించారు.ఈ ట్రాన్స్ఫార్మర్ను నెల్లూరు కరెంట్ ఆఫీస్ నుంచి తీసుకువచ్చినట్టు ఏడి రమేష్ చంద్ర వెల్లడించారు. ఇకపై బుచ్చిరెడ్డిపాలెం మండలం లో లోవోల్టేజీ సమస్య పునరావృతం కాదని పేర్కొన్నారు.

Featured

PM – కిసాన్ పథకం ఫట్ – బుచ్చిరెడ్డిపాలెం రైతుల ఆవేదన.

8-06-2020 బుచ్చిరెడ్డిపాళెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని రెడ్డిపాలెం, పల్లప్రోలు తదితర గ్రామాలలోని రైతన్నలు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత కలిగినా లబ్ధి చేకూరడం లేదని ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ఆవిష్కరించింది. రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6000/-ఆదాయం సహకారం దేశంలోని అన్ని రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలల చొప్పున మూడు సమాన వాయిదాలలో అందించబడుతుంది. లబ్ధిదారుల రైతు కుటుంబాలను గుర్తించే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఈ ఫండ్ నేరుగా బదిలీ చేయబడుతుంది. కార్యాచరణ మార్గదర్శకాల మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి వచ్చిన రైతులు ఈ పథకం ప్రయోజనాలకు అర్హులు కారు. నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన స్థానిక పట్వారి/రెవెన్యూ అధికారి/నోడల్ అధికారి (మినిస్టర్-కిసాన్) ను రైతు సంప్రదించాలి. ఫీజులు చెల్లించేటప్పుడు పథకం కోసం రైతులకు రిజిస్ట్రేషన్ చేయడానికి సాధారణ సేవా కేంద్రాలు కూడా అధికారం పొందాయి. పోర్టల్ లో రైతులు ఆన్లైన్ ద్వారా రైతులు తమ స్వీయ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం తో పాటు, వారి ఆధార్ డేటాబేస్/కార్డు ప్రకారం రైతులు తమ పేర్లను PM-Kisan డేటాబేస్లో సవరించవచ్చు మరియు వారి చెల్లింపు స్థితిని కూడా రైతులు తెలుసుకోగలరు. మీకు డబ్బులు వచ్చాయా? రాలేదా? అనే విషయాన్ని ఆన్‌లైన్‌లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. పోర్టల్ పైన కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్ ఫెయిలూర్ రికార్డ్, బెనిఫీషియరీ స్టేటస్, బెనిఫీషియరీ లిస్ట్ అనే నాలుగు ఆప్షన్లు కనినిస్తాయి. వీటిల్లో బెనిఫీషియరీ స్టేటస్ ఎంచుకోవాలి. ఇప్పుడు మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కేవలం పీఎం కిసాన్ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది. దీని సాయంతో కూడా మీరు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా ఈ పథకం కింద షుమారు 8.89 కోట్ల మంది రైతులకు షుమారుగా రూ.17,793 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇప్పటి వరకు 2 హెక్టార్ల లోపు ఉన్న రైతులకే పీఎం కిసాన్ వర్తింప చేశారు. దీని ద్వారా కొంతమేరా మాత్రమే లబ్ధి చేకూరింది. ఇక నుంచి అందరికీ వర్తింపచేయడంతో షుమారు 14.50 కోట్ల మందికి ఈ లబ్ధి పెరగనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వై ఎస్ ఆర్ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రూ.13,500 ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే రూ 11,500ను జమ చేయగా. మిగిలిన రూ.2వేలు ఇప్పుడు జమ చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. రైతు భరోసా పథకం కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్న ఈ మద్యే సేవలకు అందుబాటులోకి వచ్చిన రైతు భరోసా కేంద్రాలకు వెళ్లిన అక్కడ కూడా వివరాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా అర్హులైన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరలేదని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సీజన్లలో పంటకి పెట్టుబడులు కూడా పెట్టుకోలేని సన్నకారు రైతులు చాలామంది ఉన్నారని అన్నారు. ఈ పథకాలన్నీ లేక ముందు పెట్టుబడులకు ఇబ్బంది పడే వాళ్ళమని పెట్టుబడుల కోసం బయట అప్పులు తెచ్చుకోవడం లేదా భార్య మెడలోని పుస్తులను తాకట్టు పెట్టేవాళ్ళమని చెప్పారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో పెట్టుబడులకు ఇబ్బంది లేదని అన్నారు. కానీ ఈ పథకాలు అర్హతలు కలిగి ఉన్నా చాలా మంది రైతులకు ఆమడ దూరంలోనే నిలిచి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఆయా గ్రామాల రైతులు గ్రామ సచివాలయంలో వివరాలు అడిగితే మాకు తెలియదు ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇలా కొంతకాలంగా అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఈ సమస్యపై ఎవరి వద్దకు వెళ్లినా పరిష్కారం చూపలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని రైతులు మండల స్థాయి అధికారులుకు మాకు పరిష్కారం చూపించగలరని వారియొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Featured తూర్పు గోదావరి

పంచాయితీరాజ్ ఇంజనీర్ల సహాయనిరాకరణ..

తూర్పుగోదావరిజిల్లా, అమలాపురం : అమలాపురం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డివిజన్ ఆవరణలో పి.ఆర్ ఇంజినీర్లు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు.ఎన్.ఆర్.జి. ఈ.ఎస్ సీసి రోడ్ల పనులపై పలుమార్లు తనిఖీలు చేపట్టడం ప్రభుత్వానికి తగదని రాష్ట్ర పి.ఆర్. జేఏసీ పిలుపు మేరకు సోమవారం పంచాయతీ రాజ్ కార్యాలయంలో డివిజన్ నలుమూల ల నుండి ఇంజినీర్లు హాజరయ్యి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జే ఏ సి కన్వీనర్. అన్యం. రాంబాబు , కో ఆర్డినేటర్ డి ఈ లు వి.చంద్రశేఖర్ , కె.రమకాంత్, జే. మురళి కృష్ణ , ఏ.ఈలు వి.రాధా కృష్ణ ,జి. సత్యనారాయణ, డి.యస్.ఎల్. సంధ్య, హెచ్. డి. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల కాలం లో గ్రామాల్లో లో వేసిన సి సీ.రోడ్లను అనేక పర్యాయాలు తనిఖీలు చేపట్టడం వల్ల ఇంజినీర్లు మానసిక వేదనకు గురి అవుతున్నారని తెలిపారు.గ్రామీణ భారతం అభివృద్ధిలో కీలక పాత్రవహిస్తున్న ఇంజనీర్ల కు ఇటువంటివి చర్యలు అవమానకరం గా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే 9 క్యూ.సి టీమ్స్ జిల్లా స్థాయిలో 1100 పనులను విచారణ చేస్తుండగా,మధ్యలో మళ్ళీ విజిలెన్స్ టీమ్స్ ను కూడా తనిఖీ చేయమని మౌఖికం గా ప్రభుత్వం ఆదేశించడం శోచనీయమన్నారు.నాడు ఇంజినీర్లు రేయింబవళ్లు కష్ట పడి సి సీ రోడ్లు నిర్మాణం చేపట్టడం వల్ల,కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలకు,కలెక్టర్లకు కు అవార్డులు రావడం జరిగిందని తెలిపారు.వెంటనే సదరు తనిఖీలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

చిత్తూరు

చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ వికటించి పురిటిబిడ్డ మృతి …. .

CHITTOR:ఆపరేషన్ వికటించి పురిటి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు . ఇందుకు బాధ్యులైన ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ ఘటన మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది . చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో పురిటిబిడ్డ చనిపోయింది . పుంగనూరు వాండ్లపల్లికి చెందిన ముబారక్ బేగం ( 23 ) పురిటి నొప్పులతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం చేరింది . సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది . అయితే అంత సమయం లేకపోవడం వల్ల సాధారణ కాన్పు చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు . అనంతరం కొద్దిసేపటికే మగ బిడ్డకు బేగం జన్మనిచ్చింది . అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయి ఉండటం , పురిటి బిడ్డకు గాయాలు ఉండటాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు గమనించారు . ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా పురిటి బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపించారు . ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు

ప్రకాశం

దళితులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి: దళిత ప్రజాసంఘాలు

దర్శి, జూన్ 8, 2020 (పున్నమి విలేఖరి): దర్శి పట్టణంలో సోమవారం స్థానిక ఏపీటీఎఫ్ ఆఫీసు లో రాష్ట్రదళితసేన దరిశి నియోజకవర్గ కమిటీ అద్వర్యం కె.మార్కు అద్యక్షతన “దళితులపై దాడులు – ప్రభుత్వంవైఖరి” అనే ఆంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర దళితసేన దరిశి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దళితులు, దళిత అధికారులు పై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుపై దాడులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతక్షణమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించాలని దళిత అధికారుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని, దళిత అధికారుల పై దౌర్జన్యం, దాడి చేసిన ముద్దాయిను ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటియాక్టు కింద అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిసి సంఘాల రాష్ట్ర నాయకులు అన్నవరపు వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈపాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఇంకా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్ని మాట్లాడారు. ఈకార్యక్రమంలో కె.మార్కు, ఆగ్రో టైం స్కెల్ వర్క్స్ &ఎంఫ్లాయిస్ యూనిట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, ఎరుకులసంక్షేమ సంఘంనాయకులు వెంకటేశ్వరరావు, ఎస్సీ నాయకులు జీ. పెద్ద వెంకటస్వామి, ఏపీటీఎఫ్ దరిశి మండల ప్రధాన కార్యదర్శి యన్.జాన్, పాస్టర్ సంఘం నాయకులు ఇత్తడి ఏసుపాదం‌‌, రాచపూడి ఆహరోన్ తదితరులు పాల్గొన్నారు.

Featured

గరీబ్ బిరియాని సెంటర్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు ✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నెల్లూరులోని గరీబ్ బిర్యానీ సెంటర్ పై ఆదివారం పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. గరీబ్ బిర్యానీ సెంటర్ యాజమాన్యానికి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ దాడులలో పాల్గొన్న పుడ్ సేఫ్టీ అధికారి వెంకరమణ మాట్లాడుతూ..నగరంలో మున్నిపల్ కార్పొరేషన్ ఇచ్చిన అనుమతులను పాటిస్తూ విక్రయాలను కొనసాగించాన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని విక్రయాలు కొనసాగిస్తే లక్ష రూపాయలు జారిమానా విధిస్తామన్నారు.