వార్త ముఖ్యాంశాలు
- *నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ – రూ.
- 78 వేల వరకు భారీ సబ్సిడీ**సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కరెంట్ బిల్లుల భారం శాశ్వతంగా దూరం* పల్నాడు జిల్లా: నరసరావుపేట ప్రజలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బిల్లుల భారాన్ని శాశ్వతంగా తగ్గించడమే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…
- స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నివాస గృహాల పైకప్పులపై సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని, దీనివల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు…
*నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ – రూ. 78 వేల వరకు భారీ సబ్సిడీ**సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కరెంట్ బిల్లుల భారం శాశ్వతంగా దూరం*
పల్నాడు జిల్లా: నరసరావుపేట ప్రజలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బిల్లుల భారాన్ని శాశ్వతంగా తగ్గించడమే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టిందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.
స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నివాస గృహాల పైకప్పులపై సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని, దీనివల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కరెంట్ బిల్లుల భారం పూర్తిగా తప్పుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
అంతేకాకుండా, ఇంటి వినియోగానికి పోను మిగిలిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చని వివరించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీని అందిస్తోందని, 1 నుండి 2 కిలోవాట్లకు రూ. 30,000 నుండి రూ. 60,000 వరకు, 3 కిలోవాట్ల సామర్థ్యానికి గరిష్ఠంగా రూ. 78,000 వరకు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే సబ్సిడీ జమ చేస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా సాంకేతిక అనుమతులు, నెట్ మీటరింగ్ మరియు ప్యానెళ్ల బిగింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అర్హులైన నియోజకవర్గ ప్రజలందరూ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
