Thursday, 9 July 2026

Blog

Featured

స్పాట్… చావనైనా చస్తాం గాని మా భూములు మాత్రం ఇవ్వం.

*స్పాట్… చావనైనా చస్తాం గాని మా భూములు మాత్రం ఇవ్వం.* 28-05-2020 *బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి)* కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1977 సంవత్సరంలో దళితులు ఆకలికి అలమటించ కుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మిగిలిన భూముల సీలింగ్ చట్టం క్రింద నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామంలోని హరిజన అరుంధతీయవాడలో దళితులకు ఇందిరాగాంధీ 40 మందికి సుమారు పది ఎకరాల భూమి ఇచ్చింది. అయితే 2019 జనవరి వరకు ఆ భూములు నెల్లూరు జిల్లా ఆర్ డి ఓ పేరుపై ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆ స్థలాలను తమ పేరు మీదకు మార్చి పట్టాలు ఇవ్వాలని వారు గత ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. టిడిపి ప్రభుత్వం ఆ స్థలాలను తమ పేరు మీదకు మార్చి పట్టాలను ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దామరమడుగు గ్రామంలో లో చుట్టూ పక్కల ఎక్కడ భూములు తక్కువ ధరలు లేనందువల్ల ఇప్పుడు అధికార పార్టీ నాయకులు, అధికారులు కన్ను దళితుల భూములు పై పడింది. లాక్ డౌన్ కు ముందు తమ భూముల అమ్మే ప్రసక్తే లేదంటూ వారి తిరగబడ్డారు. లాక్ డౌన్ అనంతరం మరల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. మీరు కనుక భూములను అమ్ముకుంటే మీ అకౌంట్లో డబ్బులు వేసి ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడతాను అంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు బెదిరిస్తున్నారు అంటూ దామరమడుగు మాజీ సర్పంచ్ సురేష్ అన్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడి ఈ విషయం పై చర్చించి తమకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. తమకు మాత్రం అన్యాయం జరుగుతుంటే రానున్న కాలంలో తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Featured

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయల పంపిణీ

28-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ, గమళ్లపాలెం, ఎస్సీ కాలనీలు , ఎస్ టి కాలనీలు లో దాదాపునాలుగు టన్నుల కూరగాయలు ను దాదాపు 1500 పేద కుటుంబాలకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు మనుబోలు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పేద ప్రజలకు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అనిఅన్నారు కరోన మహమ్మారి వచినప్పటి నుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూ సహాయసహకారాలుఅందిస్తున్నారు. మనుబోలు కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి మనుబోలులో సోంతనిధులతో నిత్యవసరవస్తువులు పంపిణీ చేసారు. మనుబోలు మండల కేంద్రంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో బి.సి.కాలనీ, గమళ్ల పాళెం ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కరోనా వ్యాధి పట్ల అవగాహనతో నివారణ చర్యలను తీసుకుంటూ, ధైర్యంగా ఉండండిఅని వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ,పారిశుద్ధ్య నిర్వహణ లో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు ఆదేశించడం ఈ ప్రాంతంలోని వారికి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకుల సరఫరాతో పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి విషయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా అవసరాల కోసం 24 గంటలు సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, అవసరమైన ఇతర సరుకులను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే చేర్పిస్తున్నారు. ప్రజలెవ్వరూ ఆందోళ చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించా రు.రెడ్ జోన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, అవసరమైన వసతులు మౌలిక సదుపాయాల కల్పనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని అన్నారు.రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోకలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతున్నా సర్వేపల్లి నియోజకవర్గం లో మాత్రం పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకున్న వ్యక్తి మన అందరి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,బీసీ సెల్అధ్యక్షులుదాసరిభాస్కర్ గౌడ్,చేరెడ్డిపట్టాభిరామిరెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,చల్లా రవీంద్ర ,చలగల దయాకర్ ,సుధాకర్ రెడ్డి ,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Featured

ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయం

28-05-2020 (పున్నమి ప్రతినిధి) విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయమని చెప్పవచ్చు. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రజల మన్ననలు పొందారు. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఎన్టీఆర్.. ఈ పేరు ఒక ప్రభంజనం, ఒక చరిత్ర, భావితరాలకు ఆదర్శం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగు ఉన్నంత కాలం, తెలుగు వెలుగుతూ ఉన్నంత కాలం శాశ్వతం.సినీ జగత్తులో నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు. ఎన్టీఆర్‌గా, అన్నగా తెలుగు జాతి హృదయాలను గెలుచుకున్న విశ్వనటుడు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. తెలుగు భాషా నుడి కారాలకు పర్యాయపదం. ఆత్మగౌరవ పతాక. మరోవైపు ఎన్టీఆర్‌ అంటే క్రమశిక్షణ. తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. నాలుగు దశాబ్దాల పైబడిన సినీ ప్రస్థానంలో నాలుగు వందలకు పైబడి నటించిన చిత్రాల్లో తెలుగువారి జీవన నేపథ్యమే ప్రతిఫలించింది. పురాణ పాత్రల ద్వారా ఆరాధ్యదైవంగా నిలి చారు. మనుబోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 97 జయంతిని పురస్కరించుకొని మనుబోలు,యాచవరం గ్రామంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి ,వైద్య సిబ్బందికి ఓ. .ఆర్. ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి ,కలికి రమేష్ రెడ్డి ,సాని వెంకటరమణయ్య,దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజా గౌడ్ ,రావుల అంకయ్య గౌడ్, చేరెడ్డి పద్మనాభ రెడ్డి ,చల్ల గిరి ప్రసాద్ ,శ్రీనివాసులు రెడ్డి ,చింతల వెంకటేశ్వర్లు, గుంజి రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మౌలిక వసతులు కల్పనే నాడు-నేడు లక్ష్యం …జిల్లా కలెక్టర్.యం. వి.శేషగిరి బాబు

27-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు పర్యటించారు. బండేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను…, కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నాడు నేడు కార్యక్రమానికి 401 కోట్లరూ పాయాలు కు ప్రతిపాదనలు పంపినామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపినారు. బుధవారంమనుబోలు మండలం లోని చెర్లోపల్లి, బండే పల్లి గ్రామాలను ఆయన పరిశీలించారు జిల్లాలో 1085 స్కూ ళ్ల లో గదులునిర్మిస్తామన్నారు. ఇందుకుగాను 115 కోట్లు రూపాయల నిధులు తొలివిడితలో మంజూరు అయ్యినయన్నారు. ఆగస్టు 3 న పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్‌ పెయింటింగ్, ఫినిషింగ్ పూర్తవ్వాలన్నారు. స్కూలు ప్రారంభం కాగానే ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారమ్స్, బూట్లు అందించాలని.., మెరుగైన మౌలిక వసతులతో అత్యత్తుమ విద్యా బోధన అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని… డి.పి.ఓ కి తెలిపారు. నాడు-నేడు పనులకు ఇసుక కొరత ఉందని, సిమెంట్ ధరలు కూడా అధికంగా ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్ మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడి నాడు-నేడు పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హార్టీ కల్చర్ ఎ.డి. తో కలిసి.., మనుబోలు మండలంలోని వంగతోటలను పరిశీలించారు. సాధారణంగా కోయంబేడు మార్కెట్ కి పండిన కూరగాయలను ఎగుమతి చేస్తుంటామని.., కరోనా కేసులు నమోదు అవడంతో కోయంబేడ్ మార్కెట్ కి కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయని.., దీంతో పండిన పంటన అమ్ముకోలేక పోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానికంగా కూరగాయ మార్కెటింగ్ కి వ్యాపారులతో మాట్లాడి., రైతులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కోదండరాం పురం లోని మెయిన్ పాఠశాల శిథిలావస్థకు చేరిందని విలేకరులు చెప్పగా వెంటనే స్పందించి ఎంపీడీవో సమగ్ర నివేదిక ఇస్తే చర్యలు చేపడతామన్నారు . ఈ కార్యక్రమంలోఎస్ ఎస్ ఏ ఈఈ శ్రావణ్ కుమార్ ,ఈ ఈ ఆనంద్ రెడ్డి డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి, ఉద్యావనశాఖఎ.డి,ఎంపీడీవోవెంకటేశ్వర్లు,తహశీల్దార్ హరనాథ్ అధికారులు పాల్గొన్నారు.

Featured

పరామర్శిస్తున్న వెంకటగిరి మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : వెంకటగిరి మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ రాపూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షలు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి ఆరోగ్యం సరిలేనందున చెన్నై నందు చికిత్స అనంతరం జోరేపల్లి స్వగ్రామం నందు వారిని పరామర్శించారు అనంతరం రాపూరు మండలం పంగిలి గ్రామ నాయకులు దేవళ రమణయ్య గత కోద్దిరోజులుగ అనరోగ్యంతో బాధపడుతున్నందున వారిని కూడా కలిసిన మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ వీరి వెంట జిల్లా పార్టీ అధికార ప్రతినిది నువ్వుల శివ రామకృష్ణ, రాపూరు పట్టణ అధ్యక్షులు ముక్తార్, మండల మహిళ నాయకురాలు రవణమ్మ, పట్టణ యువత అధ్యక్షుడు అహ్మద్ తదితరులు పాల్లోన్నారు

Featured

కోటి రూపాయలతో నిర్మించేందుకు తలపెట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కాకాణి.

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను అవసరం మేరకు సడలింపులు ప్రకటించిన నేపధ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడింది.లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే ఉపాధి పనులు, ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడం జరుగుతుంది.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అవసరమైన సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.సర్వేపల్లి నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశాం. నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రతి కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవసరమైన ముందస్తు చర్యలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా. మంజూరైన నిధులను గ్రామంలో ఉన్న వారందరూ ఒక్క తాటిపై ఉంటూ అవసరమైన చోట వినియోగించుకోవాలి.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతాం.అర్హులైన వారి పేర్లు ఎవరివైన జాబితాలో లేకపోతే విచారణ జరిపించి, న్యాయం చేస్తాం.ఇళ్ల స్థలాలు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇళ్ల పట్టాలు అందచేసే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు.ఉచిత రేషన్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా “సర్వేపల్లి రైతన్న కానుక” పేరుతో సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష పైచిలుకు కుటుంబాలకు బియ్యం, వంటనూనె పంపిణీ చేయడం జరిగింది. శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను అని తెలిపారు

Featured

కరోనా తో కష్టాల్లో కెళ్ళాం – ఆదుకోండి – విశ్వబ్రాహ్మణ సంఘం విజ్ఞప్తి

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నెల్లూరులోని ఆనం నివాసం వద్ద నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు వెంకటశేషయ్య ఆచారి మరియు పలువురు కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి తమ సమస్యల నివేదన సమర్పిస్తూ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్న నెల్లూరు జిల్లాలోని లక్షా 70 వేల మంది చేతివృత్తుల వడ్రంగి, కుమ్మరి, కంచర, శిల్పి, స్వర్ణకార మరియు పౌరోహిత్యం ద్వారా జీవనభృతి పొందుతున్న కుటుంబాలకు తాత్కాలిక ఆసరాగా కుటుంబానికి పది వేల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడానికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేశారు*.ఈ సందర్భంగా ఆనం వారి విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సానుకూల నిర్ణయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆనం రంగమయూర్ రెడ్డి మరియు పలువురు నెల్లూరు నగర విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.

Featured

నిరుపేద సంచారజాతులకు నాయుడుపేట పోలీసులు నిత్యావసర సరుకులు పంపిణీ.

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నాయుడుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నకలోళ్లుకు సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎసై దాసరి వెంకటేశ్వరరావు, చేతులు మీదుగా పోలీసులు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోన వైరస్ నియంత్రణ లో భాగంగా లాక్ డవున్ నేపథ్యంలో సంచారాజాతులకు తన సొంత నిధులతో తమవంతు 25 కుటుంబాలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కరోన కర్ఫ్యూ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదని రెండు, మూడు దపాలు తమ వంతు సహాయ సహకారం అందించి వారిని ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు రఫీ,సురేష్, రాజ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు

Featured

ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రెడ్ క్రాస్ ప్రాంగణంలో రక్త దాన శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణారెడ్డి గారు ప్రాంభించి స్వచ్చందంగా రక్తదానము చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్ కూడ పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ గత 2 నెలలుగా కొనసాగుతున్న కోవిడ్-19 లాక్ డౌన్ వలన ఏర్పడిన రక్త నిల్వల కొరత వలన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలు, కాన్సర్ పేషెంట్స్ మరియు గర్భిణీ స్త్రీలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ఎదుర్కొఅంటున్నారు అని అన్నారు. విశ్వవిద్యాలయం తనవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేప్పట్టటం ద్వారా సుమారు 60 యూనిట్ల రక్తం సేకరించటం గొప్ప ఘనకార్యంగా భావిస్తున్నానని అందుకు సహకరించి ముందుకు వచ్చిన ప్రతి రక్తదాతను అయన అభినందించారు. రెడ్ క్రాస్ వారు చేస్తున్న కృషిలో విశ్వవిద్యాలయము కూడా భాగస్వామి అవ్వటం చాలా సంతోషం గా ఉందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో వున్నా దాతలు అందరు ఎటువంటి భయాలు సంశయాలు లేకుండా రక్తదానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు లాక్ డౌన్ సమయం లో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు విశ్వవిద్యాలయ NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో చేపట్టటం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో కృష్ణ చైతన్య కళాశాల NCC మరియు NSS విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారని అన్నారని అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన పరిస్థుతులలో కూడా రక్తం అవసరమైన వారికందరికి అందజేయటం జరిగిందని,ఇటువంటి రక్తదాన శిబిరాల వలన ఇంకా ఎంతోమందికి రెడ్ క్రాస్ సహాయం చేయటానికి తోడ్పడుతుందని అన్నారు. చివరిగా విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కాన్సుల్ మెంబెర్ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ యూనివర్సిటీ జిల్లా అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తుందని ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, NSS సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా. వై విజయ, రెడ్ క్రాస్ సిబ్బంది రవి, మధు భాస్కర్ హెల్ప్ ది నీడి టీం మెంబెర్స్ పాల్గొన్నారు.

Featured

స్నేహహస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 55 వ రోజు అన్నదానం

రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి పి.వెంకట ప్రసాద్ జ్ఞాపకార్థం వారి మిత్రులు KVB ప్రసాద్ మరియు రేవూరు సుధాకర్ (PET) గార్ల సహాయ సహకారాలతో 500 మంది పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది మరియు గత 55 రోజులుగా స్నేహ హస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ గత 55 రోజులుగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.