Sunday, 12 July 2026

Blog

ఆంధ్రప్రదేశ్

సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆర్థిక సహాయం

సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆర్థిక సహాయం నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర వున్న అమరావతి కోచింగ్ సెంటర్ లో B. కాగేశ్వరరావు గారు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి), నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు, త్వరలోనే అగ్ని వీర్, అగ్నిపత్ ప్రారంభమవుతాయి కనుక, నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సమయంలో ఫిట్నెస్ కోసం కొంత ఆహారం అవసరం అవుతుందని, సహాయం చేయమని, సంస్థలకు మరియు దాతలకు కోరడం జరిగింది,ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి సంస్థ తరఫున నిరుపేద విద్యార్థులు ఫిట్నెస్ కోసం 8000 రూపాయిలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మన సంస్థ సభ్యులు రేవాడ త్రినాధ రావు మాస్టర్, సురపతి లక్ష్మణరావు మరియు వరప్రసాద్ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

గుండవిల్లిపేట పాఠశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన

నరసన్నపేట మండలం, జూలై 29:మండలంలోని గుండివిల్లిపేట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు గారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.అలాగే, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆహార నాణ్యతను సుదీర్ఘంగా పరిశీలించిన ఆయన, పిల్లలకు పోషకాహారంతో కూడిన, శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని పాఠశాల నిర్వాహకులకు సూచనలు చేశారు.

అన్నమయ్య

విద్యార్థినిలకు అవగాహన కల్పించిన సిఐ

రైల్వేకోడూరు చిట్వేల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థినిలతో మంగళవారం సిఐ హేమ సుందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు రోడ్డు ప్రమాదాలు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. విద్యార్థినిలకు యు టీజింగ్ పై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థినిలు శ్రద్ధగా చదువుకోవడమే కాకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.

తెలంగాణ పెద్దపల్లి

*కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించాలి*

*ఘనంగా మంథని మున్సిపాలిటీ నాలుగవ మహాసభలు* *కార్మికుల హక్కుల కోసం రాజిలేని పోరాటాలు నిర్వహించాలి* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మంథని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాలుగవ మహాసభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సీనియర్ మున్సిపల్ కార్మికుడు వడ్లకొండ రాజయ్య జండా ఆవిష్కరణ చేశారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీ కార్మికులు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రావణపల్లి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ పాల్గొనగా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య సహార్థ సందేశం ఇవ్వగా, మున్సిపల్ కార్మికులు గడిపెళ్లి మల్లేష్, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, భాగ్య, పోచమ్మ, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా యు.ఎస్.పి.సి యాదాద్రి జిల్లా కమిటీ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్ పీసీ) నాయకులు కోరారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ఆవరణంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూఎస్బీసీ నాయకులు *ముక్కెర్ల యాదయ్య, జి లక్ష్మీనరసింహారెడ్డి, మెతుకు సైదులు, మైలారం సత్తయ్య* మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని, 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి, పీఆర్సీని ప్రకటించి 1/7/2023 నుండి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని, సీ పీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను అమలు చేయాలని, 317 జీ ఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారివారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలన్నారు. టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్ భాస్కర్, జీ వి రమణారావు, జె కరుణాకర్, జనార్ధన్, బాలయ్య, విజయ, టి. వెంకన్న కె వెంకన్న తదితరులు పాల్గొన్నారు. *USPC యాదాద్రి జిల్లా కమిటీ*

తెలంగాణ పెద్దపల్లి విద్య విజ్ఞానం

మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం

*మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ మీడియట్ 2025 – 2026 మొదటి విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నెల 31 తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇదివరకే దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అన్ని అర్హతలను తెలియజేసే సర్టిఫికెట్లతో ఈ నెల 31 తేదీన ఉదయం 9 గంటలకు తమకు అడ్మిషన్ కావాల్సిన గురుకుల జూనియర్ కళాశాలలో హాజరుకావాలని ఆయన వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మెరిట్ లిస్టు ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అడ్మిషన్లన్నీ రిజర్వేషన్ ప్రకారం, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కేటాయించబడతాయన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హతలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలనీ, విద్యార్థులు తమ స్వంత జిల్లా/ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలనీ, పదవ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, పదవ తరగతి మార్కుల మెమో, అవసరమైన సర్టిఫికెట్ లన్ని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ. 1,50,000 మించకూడదనీ, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 2025 జనవరి 1 వ తేదీన లేదా అంతకుముందు తేదీలో తహశీల్దార్ జారీ చేయాలనీ, విద్యార్థుల వయస్సు 2025 ఆగస్టు 31 తేదీ నాటికి 17 సంవత్సరాలు మించకూడదనీ, ఈ విషయంలో ఎస్సీ విద్యార్థులందరికీ ఒక సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

యాదాద్రి భువనగిరి

దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు ఈ రోజు భువనగిరి మండలం అనాజీపురం గ్రామం లొ దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా స్కూల్ ఫౌండర్ చైర్మన్ Rev ఫాదర్ కటా రాజులు గారు పాల్గున్నారు, ఈ సందర్బంగా విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలిపారు మరియు స్కూల్ కరస్పాండెంట్ చిన్నప్ప గారు మాట్లాడుతు ప్రజా స్వామ్యం లొ ఓటు చాల విలేవైనది అని తెలిపారు, విద్యార్థులు రాజకీయంగా ఎడగలి అని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్ సౌజన్య గారు మట్లాడుతు ఎన్నికలు గెల్పుందిన విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కి కృషి చెయ్యాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గున్నారు

యాదాద్రి భువనగిరి

శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈరోజు భువనగిరి పట్టణంలో శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది*, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరు రాజు మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని అతి పురాతన పెద్ద దేవాలయం శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి వారీ ఆలయంలో ఈరోజు నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈరోజు పుట్టలో పాలు పోసి వారు కోరిన కోరికలు స్వామివారి అనుగ్రహంతో నెరవేరాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ, కప్పగంతుల ప్రవీణ్ శర్మ పుట్టపాక భీష్మ శర్మ దర్గా ఈ దేవేందర్ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

హనుమకొండ

వ్యవసాయ సొసైటీ ఎరువుల సరఫరా పై తనికి చేసినా హన్మకొండ కలెక్టర్…

ఈరోజు PACS మాదారం ఎరువుల గోదామును తనిఖీ చేసిన హన్మకొండ కలెక్టర్ గౌరవ శ్రీమతి *శ్రీ స్నేహ శబరిష్,* గారు. రికార్డులను పరిశీలించినారు అక్కడ ఉన్న రైతులను యూరియా సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాదారం సొసైటీ చైర్మన్ *నల్లెల్ల లింగమూర్తి* గారు మాదారం సొసైటీ పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉన్నందున మాదారం సొసైటీకి అదనంగా 300 టన్నుల యూరియాను కేటాయించాలని గౌరవ కలెక్టర్ గారిని కోరినారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గారు నోడల్ ఆఫీసర్ జ్యోతి గారు CEO రాజేందర్ AEO శైలజ గారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంథని మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు మంథని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు ఆసుపత్రి, గోపాల్పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను గర్భిణీ మహిళలకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోపాల్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. గద్దెలపల్లి ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించి ఏఎంసీ ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్సీడీ స్క్రీనింగ్, ఎక్స్రే, టీబీ, ముక్తు భారత్, ఆరోగ్య మహిళా తదితర వాటిపై ఆరా తీశారు. ఓ పీ సేవలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీవో శశికళ, మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఏఈపిఆర్ అనుదీప్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.