పలమనేరు, జులై2,2020(పున్నిమి విలేకరి):
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై వ్యతిరేకిస్తూ నేడు జాతీయ స్థాయి కార్మిక, ఉద్యోగ సంఘాలు ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎపీఎన్జీఒ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు కె.ఆనందబాబు , కార్యదర్శి సి.కె.బాలాజీ , జిల్లా ఉపాధ్యక్షుడు వై. లక్ష్మీపతి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… PFRDA బిల్లు రద్దు, కరువుభత్యం నిలుపుదల ఉత్తర్వుల ఉపసంహరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడం, కోవిడ్-19 బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు ,వర్కర్స్ కు ఇన్సూరెన్స్ వర్తింపు, అధిక ధరలను అరికట్టడం వంటి డిమాండ్స్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఉద్యోగులు పలమనేరు ఎన్జీఒ హోం వద్దకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తప్పక హాజరై మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ విజయవంతం చేయవలసినదిగా వారు పిలుపునిచ్చారు.
కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన
పలమనేరు, జులై2,2020(పున్నిమి విలేకరి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై వ్యతిరేకిస్తూ నేడు జాతీయ స్థాయి కార్మిక, ఉద్యోగ సంఘాలు ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎపీఎన్జీఒ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు కె.ఆనందబాబు , కార్యదర్శి సి.కె.బాలాజీ , జిల్లా ఉపాధ్యక్షుడు వై. లక్ష్మీపతి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… PFRDA బిల్లు రద్దు, కరువుభత్యం నిలుపుదల ఉత్తర్వుల ఉపసంహరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడం, కోవిడ్-19 బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు ,వర్కర్స్ కు ఇన్సూరెన్స్ వర్తింపు, అధిక ధరలను అరికట్టడం వంటి డిమాండ్స్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఉద్యోగులు పలమనేరు ఎన్జీఒ హోం వద్దకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తప్పక హాజరై మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ విజయవంతం చేయవలసినదిగా వారు పిలుపునిచ్చారు.