అనంతపురం; కరోనా నివారణలో మేము సైతం అంటూ ఓ మసీదుకు సంబంధించిన ముస్లింలు స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి కి విరాళం చెక్కును అందజేశారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీ సమీపంలోని మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల రుపాయల చెక్కును ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ సందర్భంగా వెంక్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు కరోనా విపత్తులో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని పేదప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.


